నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా శిలా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పూజల అనంతరం కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారు. లోక్‌సభలోని స్పీకర్ కుర్చీకి సమీపంలో 'సెంగోల్'ను మోడీ ఏర్పాటు చేశారు. అనంతరం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి గుర్తుగా శిలా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు నుంచి వచ్చిన పీఠాధిపతులు 'సెంగోల్' ను అందజేశారు. ఈ సందర్భంగా సెంగోల్‌కు ప్రధాని గౌరవ సూచకంగా సాష్టాంగ నమస్కారం చేశారు. తమిళనాడుకు చెందిన వివిధ పీఠాధిపతుల నుంచి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్ కూడా పాల్గొన్నారు.
ఇక నూతన పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని మోడీ సన్మానించారు. శాలువాలతో వారిని సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. కానీ పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి కాకుండా ప్రధాని ప్రారంభించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సహా 19 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
As the new building of India’s Parliament is inaugurated, our hearts and minds are filled with pride, hope and promise. May this iconic building be a cradle of empowerment, igniting dreams and nurturing them into reality. May it propel our great nation to new heights of progress. pic.twitter.com/zzGuRoHrUS
— Narendra Modi (@narendramodi) May 28, 2023