Telugu Global
National

చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని

నేటి నుంచి అందుబాటులోకి రానున్న చర్లపల్లి టెర్మినల్‌

చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన ప్రధాని
X

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సాంకేతిక, అత్యాధునిక సౌకర్యాలతో రూ. 413 కోట్లతో దీన్ని నిర్మించారు. కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌, కేంద్ర మంత్రులు సోమన్న,కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీ ఈటల రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 28న ఈ టెర్మినల్‌ను ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగాయి. అయితే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. నేటి నుంచి చర్లపల్లి టెర్మినల్‌ అందుబాటులోకి రానున్నది.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. మెట్రో నెట్‌వర్క్‌ 1000 కిలోమీటర్లపై పైగా పరిధి విస్తరించిందని తెలిపారు. జమ్ముకశ్మీర్‌, ఒడిషా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నాం. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం.దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నాం. వందే భారత్‌ ఎక్స్‌ప్రస్‌ వంటి హైస్పీడ్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వీటిలో స్లీపర్‌ వంటి కల్పించనున్నామని ప్రధాని చెప్పారు.

కొత్త రైల్వే ట్రాక్‌లతో పాటు అండర్‌ బ్రిడ్జి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాం. చర్లపల్లి టెర్మినల్‌ ద్వారా సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. దేశవ్యాప్తంగా హైస్పీడ్‌ రైళ్ల కోసం డిమాండ్‌ పెరుగుతున్నది. దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తయింది. వందేభారత్‌, అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్లు తెచ్చాం. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకున్నది. రైల్వేల ఆధునికీకరణ దేశం మఖచిత్రాన్నే మారుస్తోంది అని మోదీ చెప్పారు.

మెట్రో రైలు విస్తరణకు తోడ్పడాలని సీఎం విజ్ఞప్తి

చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీకి సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి డ్రైపోర్టు ఇవ్వానలి, ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణానికి సహకరించాలని కోరారు. మెట్రో రైలు విస్తరణకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్‌ ఎకానమీ సాధిస్తుందని రేవంత్‌రెడ్డి తెలిపారు.


First Published:  6 Jan 2025 1:20 PM IST
Next Story