Telugu Global
National

అయోధ్య కేసు పరిష్కారం విషయంలో దేవుడిని ప్రార్థించా

భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయనే ఒక మార్గాన్ని చూపుతారని పేర్కొన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

అయోధ్య కేసు పరిష్కారం విషయంలో దేవుడిని ప్రార్థించా
X

అయోధ్య కేసు పరిష్కారం విషయంలో అప్పట్లో తాను దేవుడిని ప్రార్థించినట్లు సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ గుర్తు చేసుకున్నారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయనే ఒక మార్గాన్ని చూపుతారని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ను ఆయన స్వస్థలమైన కన్హెర్సల్‌లో స్థానికులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని కేసుల విషయంలో మేము ఒక పరిష్కారానికి రాలేం. అయోధ్య కేసు విషయంలోనూ ఇదే జరిగింది. అప్పటికే ఈ కేసు మూడు నెలలుగా నా ముందు ఉంది. ఈ క్రమంలోనే నేను దేవుడి ముందు కూర్చుని.. దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని ప్రార్థించాను అని జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. తాను క్రమం తప్పకుండా ప్రార్థించానని.. దేవుడిపై నమ్మకం ఉంటే ఆయనే ఒక మార్గాన్ని చూపుతారని చెప్పారు.

అయోధ్య కేసులో 2019 నవంబర్‌9న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం విదితమే. అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును పరిష్కరించింది. ఆ ధర్మాసనంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఒకరు. అనంతరం రామాలయం నిర్మితిమై భక్తులకు అందుబాటులోకి వచ్చింది. అయోధ్యలోనే ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలంలో మసీదు నిర్మించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

First Published:  20 Oct 2024 5:14 PM GMT
Next Story