Telugu Global
National

ముగ్గురు మోడీల ఫోటోలను పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్... ఇందులో కామన్ గా ఉందేమిటో చెప్పండి అని ప్రశ్న‌

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు చేసిన ట్వీట్ వైరల్ గామారింది. ఆయన లలిత్ మోదీ, నరేంద్ర మోదీ, నీరవ్ మోదీల ఫోటోలు షేర్ చేసి ఇందులో కామన్ గా ఉన్నదేంటి ? అని ప్రశ్నించారు.

ముగ్గురు మోడీల ఫోటోలను పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్... ఇందులో కామన్ గా ఉందేమిటో చెప్పండి అని ప్రశ్న‌
X

''దొంగలందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకుంటుంది'' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు రెండేళ్ళ జైలు శిక్ష, ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో దేశంలో రాహుల్ పై అనర్హత వేటు, మోడీ అనే ఇంటి పేరు గురించే చర్చనడుస్తోంది. ఒక వైపు నిరసన ప్రదర్శనలు జరుగుతుండగా మరో వైపు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఈ రోజు చేసిన ట్వీట్ వైరల్ గామారింది. ఆయన లలిత్ మోదీ, నరేంద్ర మోదీ, నీరవ్ మోదీల ఫోటోలు షేర్ చేసి ఇందులో కామన్ గా ఉన్నదేంటి ? అని ప్రశ్నించారు.

రాహుల్ గాంధీకి మద్దతుగానే ప్రకాశ్ రాజ్ ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘జనరల్ నాలెడ్జ్:- ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటి? జస్ట్ ఆస్కింగ్’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అంతకుముందు లోక్ సభ గజిట్ నోటిఫికేషన్ ను ట్విట్టర్ లో ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ‘‘ప్రియమైన పౌరులారా .. ఇలాంటి రాజకీయాలకు సిగ్గుపడాలి. ఇది అసభ్యకరమైన తిరోగమన వైఖరి. మనం మౌనంగా ఉంటే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దేశం కోసం మాట్లాడే సమయం వచ్చింది’’ అని ట్వీట్ చేశారు.

ప్రకాష్ రాజ్ ట్వీట్ పై నెటిజనులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ''సత్యం మాత్రమే మాట్లాడేవారిని సత్య హరిశ్చంద్రుడు అన్నట్టు గానే అబద్దాలాడే వారినిమోడీ అని పిలిచే రోజులు ఎంతో దూరంలో లేవు'' అని బీజేపీ మాజీ నాయకుడు యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలను ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.

''ఏమి పరిస్థితులు దాపురించాయి ? దొంగను దొంగ అన్న వ్యక్తికి జైలు శిక్ష పడుతుంది. దొంగేమో బలాదూర్ గా బైట తిరుగుతుంటాడు.'' అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

First Published:  25 March 2023 4:51 PM IST
Next Story