Telugu Global
National

ఢిల్లీలో దారుణంగా పెరిగిన పొల్యూషన్ .. రేపటి నుండి కొత్త నిబంధనలు..!

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది.

ఢిల్లీలో దారుణంగా పెరిగిన పొల్యూషన్ .. రేపటి నుండి కొత్త నిబంధనలు..!
X

దేశ రాజధాని ఢిల్లీలో వాయి కాలుష్యం దారుణంగా పడిపోయింది. పొల్యూషన్ తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. గాలి కాలుష్యంగా మారడంతో కొన్ని అడుగుల దూరంలో ఉన్న వస్తువులను కూడా చూడలేకపోతున్నారు. ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ సందర్మనకు వెళ్లిన టూరిస్ట్‌లకు తాజ్‌మహల్ కనిపించట్లేదు. ఎక్కడుందో కనిపెట్టాలి అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు. AIQ లెక్కల ప్రకారం 200 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న గాలి మంచిది కాదు. కానీ ఢిల్లీలో ఏకంగా 432 పాయింట్లకు పైగా పెరిగిపోయింది వాయు కాలుష్యం. దాంతో ఖచ్చితమైన కాలుష్య వ్యతిరేక చర్యలు అమలకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

రేపు ఉదయం 8 గంటల నుంచి నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. రేపటి నుండి ఢిల్లీలో నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ నగరంలోకి “బిఎస్-3” వాహనాలు, డీజిల్ వాహనాలు ప్రవేశం పై నిషేధం విధించింది. ఢిల్లీలోని రహదారులు, చెట్ల పై నీళ్లు చల్లే వాహనాల సంఖ్య పెంచింది. అలాగే ఐదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

First Published:  14 Nov 2024 7:49 PM IST
Next Story