Telugu Global
National

జర్నలిస్టులపై పోలీసింగ్ పెరిగిపోతోంది... ఢిల్లీ జర్నలిస్టుల సంఘం ఆందోళన‌

ఇటీవల విడుదలైన హ్యూమన్ రైట్స్ వాచ్ తాజా నివేదికను ఉటంకిస్తూ, DUJ "ఆ నివేదిక ఈ రోజు భారతదేశంలో జర్నలిస్టులు, జర్నలిజం పై పెరుగుతున్న పోలీసింగ్ ను ప్రతిబింబిస్తుంది.''అని పేర్కొన్నారు. మహమ్మద్ జుబేర్, రూపేష్ కుమార్ సింగ్, సిద్ధిక్ కప్పన్ తదితర జర్నలిస్టుల అరెస్టుల పట్ల హెచ్‌ఆర్‌డబ్ల్యూ నివేదిక వెలిబుచ్చిన ఆందోళనతో DUJ గొంతు కలిపింది.

జర్నలిస్టులపై పోలీసింగ్ పెరిగిపోతోంది... ఢిల్లీ జర్నలిస్టుల సంఘం ఆందోళన‌
X

దేశంలో జర్నలిస్టులపై రోజు రోజుకు పెరుగుతున్న పోలీసింగ్ కు వ్యతిరేకంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా దేశంలో పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాల ధోరణి"కి వ్యతిరేకంగా జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (DUJ) ప్రెసిడెంట్, S.K. పాండే, ప్రధాన కార్యదర్శి, సుజాత మధోక్ విడుదల చేసిన ఒక ప్రకటనలో కనీస అధికారాలు లేని ప్రెస్ కౌన్సిల్ స్థానంలో మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియానుతక్షణ‍ం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కోరారు.

ఇటీవల విడుదలైన హ్యూమన్ రైట్స్ వాచ్ తాజా నివేదికను ఉటంకిస్తూ, DUJ "ఆ నివేదిక ఈ రోజు భారతదేశంలో జర్నలిస్టులు, జర్నలిజం పై పెరుగుతున్న పోలీసింగ్ ను ప్రతిబింబిస్తుంది.''అని పేర్కొన్నారు. మహమ్మద్ జుబేర్, రూపేష్ కుమార్ సింగ్, సిద్ధిక్ కప్పన్ తదితర జర్నలిస్టుల అరెస్టుల పట్ల హెచ్‌ఆర్‌డబ్ల్యూ నివేదిక వెలిబుచ్చిన ఆందోళనతో DUJ గొంతు కలిపింది.

ఫహద్ షా, సజాద్ గుల్‌ల అరెస్టులతో కాశ్మీర్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని డియుజె ఆవేదన వ్యక్తం చేసింది. "హ్యూమన్ రైట్స్ వాచ్ రిపోర్ట్ ప్రకారం, 'కాశ్మీర్లో ఆగస్టు 2019 నుండి 35 మంది జర్నలిస్టులు పోలీసు విచారణ, దాడులు, బెదిరింపులు, భౌతిక దాడి, ఉద్యమ స్వేచ్ఛపై ఆంక్షలు, కల్పిత క్రిమినల్ కేసులను ఎదుర్కొన్నారని' DUJ తెలిపింది.

HRW నివేదికను ప్రస్తావిస్తూ, “చాలా హేయంగా, ప్రభుత్వం, పలు కార్యకర్తల‌ సమూహాలు మీడియాపై అణిచివేతను, దాడులను తీవ్రతరం చేయడాన్ని, మీడియాపై దాడులతో పాటు మీడియా వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడాన్ని DUJ ఖండించింది.

NDTV ఛానెల్ బలవ‍ంతపు టేకోవర్, దాని పర్యవసానంగా ఛానెల్ నుండి రాజీనామాల పరంపర పట్ల‌ DUJ ఆందోళన వ్యక్తం చేసింది. స్వతంత్ర యాంకర్ రవీష్ కుమార్, గ్రూప్ ప్రెసిడెంట్ సుపర్ణ సింగ్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అరిజిత్ ఛటర్జీ, చీఫ్ టెక్నాలజీ అధికారి కవల్జిత్ సింగ్ బేడీ రాజీనామాలిచ్చారని DUJ పేర్కొంది. "NDTV గ్రూప్‌పై అదానీ గ్రూప్ పూర్తి నియంత్రణను తీసుకున్నందున ఈ రాజీనామాల పరంపర జరిగింది" అని DUJ తెలిపింది.

"ప్రభుత్వం, కార్పొరేట్ ప్రచారాన్ని, విభజన, మతపరమైన ద్వేషపూరిత ప్రసంగాలను ప్రచారం చేయడానికి బదులుగా కొంత స్వతంత్రంగా రిపోర్టింగ్ చేసిన అతి తక్కువ‌ ఛానెల్‌లలో NDTV ఒకటి" అని DUJ పేర్కొంది.

సమాజంలో చీలికలను కలిగించడంలో టీవీ ఛానెల్‌ల పాత్రపై సుప్రీంకోర్టు ఇటీవల చేసిన పరిశీలనలను, ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహించే వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులకు ఇచ్చిన ఆదేశాలను DUJ స్వాగతించింది.

సుదర్శన్ న్యూస్ టీవీ ద్వారా "UPSC జిహాద్" ప్రచారం, మీడియాలో కరోనా జిహాద్ ప్రచారం, ముస్లిం వ్యతిరేక ప్రకటనలు బహిరంగంగా చేసిన ధరమ్ సన్సద్ సమావేశాలతో సహా ద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అనేక పిటిషన్లను విచారిస్తున్నట్లు DUJ తెలిపింది.

First Published:  17 Jan 2023 7:10 AM IST
Next Story