Telugu Global
National

బెంగళూరులో రేవ్‌ పార్టీ.. పట్టుబడిన వారిలో టాలీవుడ్‌ ప్రముఖులు?

దాదాపు 15 లగ్జరీ కార్లను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఈ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు వార్తలు వస్తుండడం టాలీవుడ్‌ల కలకలం రేపుతోంది.

బెంగళూరులో రేవ్‌ పార్టీ.. పట్టుబడిన వారిలో టాలీవుడ్‌ ప్రముఖులు?
X

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో రేవ్‌ పార్టీ కలకలం రేగింది. బర్త్‌డే పార్టీ పేరుతో ఆదివారం రాత్రి రేవ్ పార్టీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ వాడినట్లు గుర్తించారు. పట్టబడ్డ వారిలో టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది.


పార్టీ జరిగిన ఫామ్‌హౌస్‌ హైదరాబాద్‌ కాన్‌కార్డ్ సంస్థకు చెందిన గోపాల్‌ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలిపిన పోలీసులు.. విమానంలో హైదరాబాద్‌ నుంచి యువతీయువకులను ఈ పార్టీకి తరలించినట్లు నిర్ధారించారు. ఐతే అర్ధరాత్రి అందిన పక్కా సమాచారంతో తెల్లవారుజామున 3 గంటలకు ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు. భారీగా డ్రగ్స్‌, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో 25 మంది యువతులు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 15 లగ్జరీ కార్లను సైతం పోలీసులు సీజ్ చేశారు. ఈ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఉన్నట్లు వార్తలు వస్తుండడం టాలీవుడ్‌ల కలకలం రేపుతోంది. ఇప్పటివరకూ ఎవరి పేర్లు బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ - CCB పోలీసులు విచారిస్తున్నారు.

ఆ కారుతో నాకు సంబంధం లేదు - కాకాణి

మరోవైపు ఈ పార్టీలో దొరికిన ఓ కారుపై ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌కు సంబంధించిన స్టిక్కర్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కాకాణి ఖండించారు. బెంగళూరు రేవ్ పార్టీలో దొరికిన కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కారుపై స్టిక్కర్ ఒరిజినలా.. ఫొటో కాపీనా అనేది పోలీసులే తేలుస్తారన్నారు.

First Published:  20 May 2024 12:36 PM IST
Next Story