Telugu Global
National

ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య

జార్ఖండ్‌ లోని డియోఘర్‌ లో మరో విమానం కోసం ప్రధాని వెయిటింగ్‌

ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య
X

ప్రధాని నరేంద్రమోదీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం డియోఘర్‌ కు వెళ్లారు. ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీకి తిరిగి వచ్చేందుకు డియోఘర్‌ ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ ముఖ్య నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది విమానంలోకి ఎక్కిన తర్వాత టేకాఫ్‌ కు సిద్ధమవుతున్న సమయంలో సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో ఆ విమానాన్ని అక్కడే నిలిపి వేశారు. ప్రధాని ఢిల్లీకి తిరిగి వెళ్లేందుకు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన మరో విమానాన్ని డియోఘర్‌ కు తెప్పిస్తున్నారు. ఆ విమానం చేరుకునేలోగా ప్రధాని ప్రయాణించే విమానాన్ని రిపేర్ చేసే ప్రయత్నాల్లో ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది ఉన్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రధాని డియోఘర్‌ ఎయిర్ పోర్టులోనే వెయిట్ చేస్తున్నారు.

First Published:  15 Nov 2024 5:53 PM IST
Next Story