పాత పార్లమెంటుకు మోడీ కొత్త పేరు.. అది ఏంటంటే..?
సెంట్రల్ హాల్‌లో సభ్యులనుద్దేశించి మాట్లాడిన మోడీ పార్లమెంటులో చేసిన ప్రతి చట్టం, ప్రతి చర్చ భారతీయ ఆకాంక్షను పెంపోందిచేలా ఉండాలన్నారు.
పార్లమెంట్ స్పెషల్ సెషన్ రెండో రోజు మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కొత్త పార్లమెంట్ భవనంలోకి వెళ్లే ముందు ఉభయసభల సభ్యులు పాత పార్లమెంట్ బిల్డింగ్‌లోని సెంట్రల్ హాల్‌లో మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు ప్రసంగించారు. సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక సందర్భాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు మోడీ.
సెంట్రల్ హాల్‌లో సభ్యులనుద్దేశించి మాట్లాడిన మోడీ పార్లమెంటులో చేసిన ప్రతి చట్టం, ప్రతి చర్చ భారతీయ ఆకాంక్షను పెంపోందిచేలా ఉండాలన్నారు. పాత పార్లమెంట్ గౌరవం ఎప్పటికీ తగ్గకూడదన్నారు మోడీ. ఇకపై పాత పార్లమెంట్ భవనాన్ని సంవిధాన్ సదన్‌గా పిలుద్దామని ప్రతిపాదించారు. దేశ రాజ్యాంగాన్ని రూపొందించడానికి రాజ్యాంగ పరిషత్ సమావేశాలు ఈ భవనంలోనే నిర్వహించడం వల్లే పాత పార్లమెంట్ భవనానికి సంవిధాన్ సదన్ అనే పేరు పెట్టినట్లు సమాచారం.
కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా దేశ భవిష్యత్తు గురించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని రాజకీయ పార్టీలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. తర్వాత మోడీతో పాటు సభ్యులందరూ కొత్త భవనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీలందరికీ స్పెషల్ గిఫ్ట్ బ్యాగులందించారు.
*