ఫ్రీ బస్ స్కీమ్.. ప్రధాని మోడీ ఏమన్నారంటే!
ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా హామీలు ఇవ్వడాన్ని ప్రధాని తప్పు పట్టారు. చాలా దేశాలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాయని.. అందుకు మన దేశమే ఉదహరణ అని చెప్పుకొచ్చారు మోడీ.
మహిళల ఓట్లను ఆకర్షించేందుకు ప్రధానంగా ప్రతిపక్షాలు ఇస్తున్న హామీలపై ప్రధాని మోడీ స్పందించారు. ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చిన మోడీ.. ప్రధానంగా ఫ్రీ బస్ స్కీమ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
దేశంలోని పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ఖజానాను ఖాళీ చేసే హామీలు ఇస్తున్నాయన్నారు మోడీ. ఎన్నికల్లో గెలిచేందుకు విచ్చలవిడిగా హామీలు ఇవ్వడాన్ని ప్రధాని తప్పు పట్టారు. చాలా దేశాలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నాయని.. అందుకు మన దేశమే ఉదహరణ అని చెప్పుకొచ్చారు మోడీ. మహిళలు సాధికారత సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.
ఫ్రీ బస్ స్కీమ్‌తో మెట్రో రైల్ ఫెసిలిటీ నిర్మించిన నగరాల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు మోడీ. ఈ స్కీమ్ వల్ల ప్రయాణించే 50 శాతం ప్రయాణికులు దూరమవుతారని చెప్పుకొచ్చారు. మెట్రోను భవిష్యత్ తరాల కోసం నిర్మించామన్నారు మోడీ. కానీ ఆ దిశగా ఆలోచించే వారు కరవయ్యారన్నారు. ఫ్రీ బస్ స్కీమ్ వల్ల ట్రాఫిక్ సమస్యల ఏర్పడుతుందన్నారు. మెట్రో అనేది పర్యావరణహితమైన రవాణా వ్యవస్థ అని చెప్పారు మోడీ. అయితే ఏపీలో కూడా ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తామని టీడీపీ, బీజేపీ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.