Telugu Global
National

ఎగ్జిట్‌ పోల్స్‌, స్టాక్‌ మార్కెట్‌..అతిపెద్ద స్కామ్‌ - రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ, అమిత్ షాలపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌...ఎగ్జిట్‌ పోల్స్‌, తర్వాత స్టాక్‌ మార్కెట్ల పతనం దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు.

ఎగ్జిట్‌ పోల్స్‌, స్టాక్‌ మార్కెట్‌..అతిపెద్ద స్కామ్‌ - రాహుల్ గాంధీ
X

ప్రధాని మోదీ, అమిత్ షాలపై సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌...ఎగ్జిట్‌ పోల్స్‌, తర్వాత స్టాక్‌ మార్కెట్ల పతనం దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ప్రధాని, హోం మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ స్టాక్‌ మార్కెట్‌పై మాట్లాడారన్నారు. జూన్‌ 4 కంటే ముందే స్టాక్స్‌ కొనాలని ప్రధాని మోదీ, అమిత్ షా పలు సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు రాహుల్ గాంధీ.

జూన్‌ 4కు ముందు స్టాక్స్ కొనాలని మే 13న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా చెప్పారని గుర్తు చేశారు రాహుల్. మే 19, మే 29న ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మోదీ సైతం స్టాక్‌ మార్కెట్లపై మాట్లాడారని..రికార్డులు బద్దలవుతాయని చెప్పారన్నారు రాహుల్. దీని తర్వాత జూన్ 1న మీడియా ఫేక్ ఎగ్జిట్‌ పోల్స్‌ రిలీజ్ చేసిందని ఆరోపించారు రాహుల్. అంతకుముందే బీజేపీకి 200 - 220 సీట్లు వస్తాయని ఇంటెలిజెన్స్‌ సమాచారంతో పాటు అంతర్గత సర్వే చెప్పిందన్నారు. మే 31న ట్రేడ్‌ను పరిశీలిస్తే..అసాధారణ కార్యకలాపాలు నమోదయ్యాయన్నారు. తర్వాత స్టాక్ మార్కెట్ క్రాష్‌ అయి..దాదాపు 30 లక్షల కోట్ల సంపద ఆవిరైందన్నారు రాహుల్. దాదాపు 5 కోట్ల ఇన్వెస్టర్లు నష్టపోయారని చెప్పారు రాహుల్.

స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలని హోం మంత్రి, ప్రధాని మోదీ సలహా ఇవ్వడమేంటని అనుమానం వ్యక్తం చేశారు రాహుల్. అది వాళ్ల పని కాదు కదా అని ప్రశ్నించారు. స్టాక్‌ మానిప్యూలేషన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌కు చెందిన మీడియా ఛానెల్స్‌కు మోదీ, అమిత్ షా ఇంటర్వ్యూలు ఇచ్చారన్నారు రాహుల్. స్టాక్ మార్కెట్ పతనంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పాత్రను విచారించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ-JPCని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కామ్‌లో ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు ఎగ్జిట్‌ పోల్స్ నిర్వహించిన వారు భాగస్వాములుగా ఉన్నారని ఆరోపించారు రాహుల్.

First Published:  6 Jun 2024 3:07 PM GMT
Next Story