దోషులుగా తేలిన ఎంపీలపై అటోమెటిక్ గా అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో... పిహెచ్‌డి స్కాలర్, సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

క్రిమినల్ కేసులో దోషిగా తేలిన పార్లమెంటు, శాసనసభ్యులను అటోమెటిక్ గా అనర్హులుగా ప్రకటించే ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 8(3) రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో... పిహెచ్‌డి స్కాలర్, సామాజిక కార్యకర్త ఆభా మురళీధరన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఈ విషయంపై మురళీధరన్ మాట్లాడుతూ, “ 1951 చట్టంలోని సెక్షన్ 8(3) రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలతో విబేధిస్తుంది. ఇది ప్రజలచే ఎన్నుకోబడిన పార్లమెంటు సభ్యుడు (MP), శాసనసభ సభ్యుని (MLA) వాక్ స్వాతంత్య్రానికి భంగం కలిగిస్తుంది. వారిని ఎన్నుకున్న ప్రజలకోసం పనిచేసే స్వేచ్ఛను నిరోధిస్తుంది.'' అన్నారు.
పిటిషన్ ప్రకారం, సెక్షన్ 8(3), 1951 చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 8A, 9, 9A, 10, 10A, 11లోని సబ్-సెక్షన్ (1)కి విరుద్ధంగా ఉంది. 1951 చట్టంలోని అధ్యాయం III ప్రకారం అనర్హత వేటును పరిగణనలోకి తీసుకునేటప్పుడు నేర స్వభావం, నిందితుల పాత్ర, నైతిక విషయాలు తదితర అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని మురళీధరన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. క్రూరమైన నేరాలకు పాల్పడి కోర్టుల ద్వారా శిక్షిపడిన ఎంపీ, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడమే చట్టం అసలు ఉద్దేశ్యమని ఆయన ఎత్తిచూపారు.