పెట్రోల్ రూ.84, డీజిల్ రూ. 79.. కానీ అక్కడకు వెళ్లి పోయించుకోలేరు!
పెట్రోల్, డీజిల్ పోయించే సమయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవడం. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండేవాళ్లు అక్కడ ధర తక్కువగా ఉంటే వెళ్లి పోయించుకొని డబ్బులు మిగిలించుకోవడం చేస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు ఒకటి రెండు రూపాయల ధర పెంచితేనే సామాన్యుడు ఆందోళనకు గురయ్యేవాడు. ప్రతిపక్షాలు రోడ్లపైకి ఎక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేసి తమ నిరసన తెలిపేవారు. కానీ ఇప్పుడు ప్రతీ రోజు పెంపే. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చివరకు ఈ ధరల పెరుగుదలపై రాజకీయ పార్టీలే కాదు.. ప్రజలు కూడా స్పందించడం మానేశారు. మనం ఎంత నెత్తి నోరూ బాదుకున్నా కేంద్రం దిగి వచ్చే పరిస్థితి లేదని తెలియడంతో దానిపై మాట్లాడటం బంద్ జేశారు.
పెట్రోల్, డీజిల్ పోయించే సమయంలో తగినంత జాగ్రత్తలు తీసుకోవడం. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండేవాళ్లు అక్కడ ధర తక్కువగా ఉంటే వెళ్లి పోయించుకొని డబ్బులు మిగిలించుకోవడం చేస్తున్నారు. కర్నాటక బార్డర్‌లో ఉండే ఏపీ వాహనదారులు పక్క రాష్ట్రానికి వెళ్లి పోయించుకుంటున్నారు. తెలంగాణలోని జహీరాబాద్ ప్రాంతవాసులు బీదర్, హుమ్నాబాద్ వైపు వెళ్లినప్పుడు ఫుల్ ట్యాంక్ చేసుకొని వస్తున్నారు. పేటీఎం, ఫోన్‌పే వంటి యాప్స్‌లో డిస్కౌంట్లను ఉపయోగిస్తూ.. ఆయిల్ కంపెనీలు ఇచ్చే లయాలటీ పాయింట్స్ ఉపయోగిస్తూ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఒక నగరంలో భారీ డిస్కౌంట్‌కు పెట్రోల్, డీజిల్ పోస్తున్నారు.
దేశంలో ప్రతీ నగరంలో పెట్రోల్ రేటు ఎప్పుడో రూ.100 దాటిపోయింది. డీజిల్ కూడా దాదాపు సెంచరీకి చేరువలో ఉన్నది. హైదరాబాద్‌లో ఈ రోజు పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82గా ఉన్నది. విజయవాడలో పెట్రోల్ 111.88 డీజిల్ 99.62 వద్ద విక్రయిస్తున్నారు. అయితే ఒక నగరంలో మాత్రం పెట్రోల్ రూ. 84.10, డీజిల్ రూ.79.74గా ఉన్నది.
మనం ఈ రేట్లు చూసి ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఆ నగరంలో మాత్రం క్రిస్మస్, ఆదివారం కారణంగా కాస్త రేట్లు తగ్గించి అమ్ముతున్నారు. ఇంత తక్కువ ధర అయితే వెంటనే వెళ్లి పెట్రోల్ కొట్టించుకుందామని అనుకుంటున్నారేమో. ఈ ధర ఇండియాలోనే కానీ.. అక్కడకు వెళ్లాలంటే చాలా కష్టం. ఎందుకంటే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయర్‌లో ఇలా డిస్కౌంట్ ధరలకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్నారు. అక్కడకు వెళ్లాలంటే విమానమో, ఓడో ఎక్కాలి. సో.. మనం అక్కడకు వెళ్లలేము.. పెట్రోల్, డీజిల్ తెచ్చుకోలేము. కాకపోతే మన దేశంలో ఏదో ఒక ప్లేస్‌లో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ దొరుకుతున్నాయని సంతోషిద్దాం.