Telugu Global
National

ఒక్క బాల్ కు 10 పరుగులు...ఇదేం బౌలింగ్ రా నాయనా

ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక బౌలింగ్ లో పాకిస్తాన్ కు ఒకే బంతికి 10 పరుగులు వచ్చాయి. శ్రీలంక బౌలర్ మధుశంక వరసగా 5 వైడ్ లు వేశాడు. అందులో ఒక టి బౌండరీ కాగా, పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సింగిల్ రన్ తీశాడు.

ఒక్క బాల్ కు 10 పరుగులు...ఇదేం బౌలింగ్ రా నాయనా
X

ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంక పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ విచిత్రం జరిగింది. శ్రీలంక బౌలింగ్ లో తొలి బాల్ కే పాకిస్తాన్ కు 10 పరుగులు వచ్చాయి.

పాకిస్తాన్ బ్యాటింగ్ ప్రారంభించగానే శ్రీలంక బౌలర్ మదుశంక బౌలింగ్ ప్రారంభించారు. అయితే ఆయన వేసిన తొలి బాల్ లొనే పాకిస్తాన్ కు పది పరుగులు వచ్చాయి.

మదుశంక తొలిబాల్ నే 'నో బాల్' గా వేశారు. అనంతరం పాక్ బ్యాటర్లకు ఫ్రీ హిట్ అవకాశం వచ్చింది. అయితే మధుశంక వరసగా 4 బాల్స్ వైడ్ వేశాడు. ఆ బాల్స్ లో ఓ బాల్ వైడ్ తో పాటు బౌండరీకి కూడా వెళ్ళింది. చివరకు ఆరో బంతి సరిగ్గా వేశాడు మధుశంక.

దాంతో పాకిస్తాన్ 9 పరుగులు ఎక్స్ట్రాల రూపంలో రాగా పాక్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ సింగిల్ రన్ తీశాడు. మొత్తానికి ఒక్క బాల్ లోనే 10 పరుగులు ఇచ్చిన ఘనత శ్రీలంక బౌలర్ మధుశంక సాధించారు.

First Published:  12 Sept 2022 12:31 PM IST
Next Story