Telugu Global
National

పద్మ పురస్కారాల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో 12మందికి అవార్డులు

ఈ ఏడాది మొత్తంగా 106మందికి అవార్డులు ప్రకటించారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

పద్మ పురస్కారాల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల్లో 12మందికి అవార్డులు
X

భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో పద్మ విభూషణ్ - 6, పద్మ భూషణ్ - 9, పద్మశ్రీ -91 మందిని వరించాయి. ఈ ఏడాది మొత్తంగా 106మందికి అవార్డులు ప్రకటించారు. పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ పురస్కారాలకు ఎంపిక చేశారు.

పద్మ విభూషణులు వీరే..

బాలకృష్ణ జోషి (మరణానంతరం)- ఆర్కిటెక్ రంగం- గుజరాత్‌

జాకీర్‌ హుస్సేన్‌ (ప్రముఖ తబలా విద్వాంసుడు ) (కళలు)- మహారాష్ట్ర

ఎస్‌.ఎం.కృష్ణ (కేంద్ర మాజీ మంత్రి ) (పబ్లిక్‌ అఫైర్స్‌)

దిలీప్ మహాలనబిస్‌ (ఓఆర్ఎస్ సృష్టికర్త) (మరణానంతరం) - వైద్యరంగం - పశ్చిమ బెంగాల్‌

శ్రీనివాస్‌ వర్థన్‌ (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్)- ఎన్నారై

ములాయం సింగ్‌ యాదవ్‌ (మరణానంతరం) -పబ్లిక్‌ అఫైర్స్‌ విభాగం

తెలుగు రాష్ట్రాలనుంచి 12మంది..

ఆధ్యాత్మిక విభాగంలో తెలంగాణ నుంచి చినజీయర్‌ స్వామికి, కమలేష్ డి పటేల్‌ కు పద్మ భూషణ్ ప్రకటించారు. మోదడుగు విజయ్‌ గుప్తా(సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగం), హనుమంతరావు పసుపులేటి(వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్నారు.

ఏపీ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (కళలు), గణేష్ నాగప్ప (సైన్స్ అండ్ ఇంజనీరింగ్), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), సీవీ రాజు (కళలు) కోట సచ్చిదానంద శాస్త్రి (కళలు), సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ), ప్రకాశ్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య విభాగం) పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు.

First Published:  25 Jan 2023 10:34 PM IST
Next Story