Telugu Global
National

నిత్యం దేవుడికి ప్రార్థన చేస్తున్నాడని శిక్ష తగ్గింపు.. హైకోర్టు సంచలన తీర్పు

పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి జూన్‌ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది.

నిత్యం దేవుడికి ప్రార్థన చేస్తున్నాడని శిక్ష తగ్గింపు.. హైకోర్టు సంచలన తీర్పు
X

పోక్సో కోర్టులో ఉరిశిక్ష పడిన వ్యక్తికి శిక్షను తగ్గిస్తూ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ తీర్పు సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్‌కే ఆసిఫ్‌ అలీ అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేశాడు. ఈ ఘటనపై ఒడిశాలోని జగత్‌సింగ్‌పుర్‌లో ఉన్న పోక్సో కోర్టు నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతనికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

తాజాగా ఈ కేసును విచారించిన ఒడిశా హైకోర్టు దోషికి పడిన శిక్షను కుదిస్తూ సంచలన తీర్పు చెప్పింది. అతనికి పోక్సో కోర్టు విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చుతూ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి జూన్‌ 27న 106 పేజీల తీర్పును హైకోర్టు ఇచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్‌ అలీ రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని, అతడు దేవుడి ముందు లొంగిపోయాడని ధర్మాసనం పేర్కొంది. తాను చేసిన నేరాన్ని అంగీకరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడని తెలిపింది. అందుకే అతడికి విధించిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నామని వెల్లడించింది. ఈ కేసులో బాధిత బాలిక కుటుంబానికి రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని పోక్సో కోర్టు ఆదేశించగా.. దాన్ని సవరించిన న్యాయస్థానం రూ.10 లక్షలు అందించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

First Published:  2 July 2024 5:25 AM GMT
Next Story