Telugu Global
National

అతిక్ అహ్మద్ ను ప్రతిపక్షాలే హత్య చేశాయని యూపీ మంత్రి సంచలన ఆరోపణ‌

"అతిక్‌ను హత్య చేయడంలో ప్రతిపక్షాల ప్రమేయం ఉందన్నది నిజం. కొన్ని సీరియస్ సీక్రెట్స్ అతిక్ బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రతిపక్షాలు అతన్ని హత్య చేశాయి" అని యూపీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ అన్నారు.

అతిక్ అహ్మద్ ను ప్రతిపక్షాలే హత్య చేశాయని యూపీ మంత్రి సంచలన ఆరోపణ‌
X

మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ల‌ను ప్రతిపక్షాలే హత్య చేయించాయ‌ని ఉత్తరప్రదేశ్ మంత్రి ధరంపాల్ సింగ్ శనివారం సంచలన ఆరోపణలు చేశారు. వారు తమ రహస్యాలను బయటపెడతారనే భయంతోనే ప్రతిపక్ష పార్టీలు ఈ హత్యలు చేశాయని ఆయన అన్నారు.

అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్‌లను ఏప్రిల్ 15 రాత్రి పోలీసులు ప్రయాగ్‌రాజ్‌లోని మెడికల్ కాలేజీకి తీసుకువెళుతుండగా మీడియా ముసుగులో వచ్చిన‌ ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది ప్రారంభంలో ఉమేష్ పాల్, అతని ఇద్దరు పోలీసు సెక్యూరిటీ గార్డులను హత్య చేసిన కేసులో విచారణ కోసం వారిని గుజరాత్ లోని బరేలీ జైలు నుండి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకువచ్చారు.

"అతిక్‌ను హత్య చేయడంలో ప్రతిపక్షాల ప్రమేయం ఉందన్నది నిజం. కొన్ని సీరియస్ సీక్రెట్స్ అతిక్ బయటపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ప్రతిపక్షాలు అతన్ని హత్య చేశాయి" అని యూపీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ అన్నారు.

ఆ ఇద్దరి హత్య జరిగాక‌ యోగీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ధరంపాల్ సింగ్ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

First Published:  22 April 2023 7:37 PM IST
Next Story