భారత్ వైఖరిని విమర్శించి తానొక మూర్ఖుడిలా మిగిలాను
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించిన కాంగ్రెస్ ఎంపీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన సమయంలో భారత్ వైఖరిని విమర్శించి తానొక మూర్ఖుడిలా మిగిలానని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆదర్శాలు ఆరోజు నా వాదనకు కారణం. అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడానికి బలాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకించిన చరిత్ర భారత్‌ది. అంతర్జాతీయ సరిహద్దులు, సార్వభౌమత్వాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే.. మన దేశం దాన్ని ఖండించాల్సిందే. అయితే ఆరోజు భారత్ ఒక స్టాండ్ తీసుకోలేదని నేను విమర్శలు చేశారు. మూడేళ్ల తర్వాత నేను మూర్ఖుడిలా మిగిలాను. ఎందుకంటే మూడేళ్ల తర్వాత భారత వైఖరి చెల్లుబాటు అయ్యింది. రెండు వారాల వ్యవధిలో ఉక్రె యిన్, రష్యా అధ్యక్షులను ఆలింగనం చేసుకున్నారు. రెండు చోట్లా ఆమోదం పొందారు.చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతి తీసుకొచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందన్నారు. యూరప్ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల భారత్ ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నదని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 2022లో ఆ సమయంలో భారత వైఖరిని విమర్శించిన పార్లమెంటరీ చర్చలో నేనూ ఒకడిని. కాబట్టి నేను ఇప్పటికీ నా ముఖంపై పడిన ఆ మరకను తుడుచుకుంటున్నాను అన్నారు