రామయ్యకు లక్ష తిరుమల లడ్డూలు
25 గ్రాముల బరువున్న శ్రీవారి లడ్డూను ప్రసాదంగా ఇచ్చేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసేంది. ఇందులో భాగంగానే లక్ష చిన్న లడ్డూలను ఇవాళ అయోధ్యకు పంపుతున్నారు.
దేశమంతా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం గురించే చర్చించుకుంటోంది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు తన జన్మ భూమిలో కొలువు దీరేందుకు ఇంకా రెండు రోజులే ఉంది. 22న శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో రామభక్తులు వివిధ రకాలుగా తమ భక్తిని చాటుకుంటున్నారు. రామయ్య కోసం ఏడుకొండల వెంకన్న కూడా తన ప్రసాదాన్ని పంపుతున్నారు.
అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా భక్తులకు తిరుమల లడ్డూను ప్రసాదంగా అందజేయనున్నారు టీటీడీ అధికారులు. 25 గ్రాముల బరువున్న శ్రీవారి లడ్డూను ప్రసాదంగా ఇచ్చేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసేంది. ఇందులో భాగంగానే లక్ష చిన్న లడ్డూలను ఇవాళ అయోధ్యకు పంపుతున్నారు.
ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూల చొప్పున ప్యాకింగ్ చేశారు. ఇలా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు ఈ సేవలో పాల్గొన్నారు. దాదాపు 3 వేల కేజీల బరువున్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రత్యేక విమానంలో అయోధ్యకు పంపిస్తున్నారు టీటీడీ అధికారులు.