Telugu Global
National

మరోసారి ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు

ఈ ఘటన అఖ్నూర్‌ సెక్టార్‌లో చోటుచేసుకున్నది

మరోసారి ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు
X

జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. మరోసారి ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సోమవారం అఖ్నూర్‌ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది.ముగ్గురు ఉగ్రవాదులు అర్ధరాత్రి సమయంలో జమ్మూలోకి చొరబడి ప్రయాణిస్తున్న ఆంబులెన్స్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఆంబులెన్స్‌లోకి 12కు పైగా బుల్లెట్లు దూసుకెళ్లినట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. అఖ్నూర్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని ఓ గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా..ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి పోలీసుల కలిసి ఆపరేషన్‌ చేపట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.. "అఖ్నూర్‌లోని బట్టల్ ప్రాంతంలో ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు జరిగినట్లు సమాచారం లేదు. ఫైరింగ్‌ జరగడంతో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నట్లు " అని ఆర్మీ అధికారులు తెలిపారు.గత వారం బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే.


First Published:  28 Oct 2024 10:20 AM IST
Next Story