Telugu Global
National

మరోసారి 'బండ' బాదుడు

వాణిజ్య సిలిండర్‌ ధర పెరగడం వరుసగా ఇది నాలుగోసారి

మరోసారి బండ బాదుడు
X

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచుతూ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటల్స్‌, రెస్టారెంట్లలో వినియోగించే 19 కిలోల కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ. 62 వరకు పెంచుతున్నట్లు వెల్లడించాయి. అలాగే 5 కిలోల ఎఫ్‌టీఎల్‌ సిలిండర్ల ధరలను కూడా రూ. 15 మేర పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.నేటి ఉంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపాయి. అయితే గృహ అవసరాల కోసం ఉపయోగించే సిలిండర్‌ ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.

గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 62 పెరిగి రూ. 1802.50కు చేరుకున్నది. కోల్‌కతాలో రూ. 1911.50, ముంబాయిలో రూ. 1754.50కు చేరుకున్నది. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగోసారి. ఆగస్టులో రూ. 6.5, సెప్టెంబర్‌లో రూ. 39, అక్టోబర్‌లో రూ. 48.5 పెంచారు. ఇప్పుడు ఏకంగా రూ. 62 మేర పెంచడం గమనార్హం.

వంట గ్యాస్‌ ధరలు యథాతథం

ఆయిల్‌ కంపెనీలు డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 803గా ఉన్నది. ఉజ్వల లబ్ధిదారులకు మాత్రం రూ. 603కే ఇది లభిస్తుంది. ముంబాయిలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్‌లో రూ.855గా ఉన్నది.

First Published:  1 Nov 2024 12:02 PM IST
Next Story