Telugu Global
National

ద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసులు నమోదు చేయాలి - రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ద్వేషపూరిత ప్రసంగాల నేరాలపై దాఖలైన పలు పిటిషన్లను కోర్టు ఈ రోజు విచారించింది.ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నతో కూడిన బెంచ్ ఈ రోజు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ద్వేషపూరిత ప్రసంగాలపై సుమోటోగా కేసులు నమోదు చేయాలి - రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు
X

ద్వేషపూరిత ప్రసంగాల పై సుమోటోగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎవరూ పిర్యాదు చేయకపోయినప్పటికీ పోలీసులే కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. అలా చేయని పక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

ద్వేషపూరిత ప్రసంగం తీవ్రమైన నేరమని , ఇది దేశంలోని లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేయగలదని పేర్కొంది.

ద్వేషపూరిత ప్రసంగాల నేరాలపై దాఖలైన పలు పిటిషన్లను కోర్టు ఈ రోజు విచారించింది.ఇలాంటి ప్రసంగాలు చేసిన వ్యక్తుల మతంతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, బీవీ నాగరత్నతో కూడిన బెంచ్ ఈ రోజు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని పిటిషనర్లు సిఫార్సు చేయగా, ప్రతి జిల్లాకు ఒకరిని నియమించాలని బెంచ్ సూచించింది.

కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతరుల‌ విద్వేష ప్రసంగాలపై ఎఫ్ఐఆర్ నమోదును కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసెఫ్...ఎఫ్ఐఆర్ కు అనుమతి అవసరమని మేజిస్ట్రేట్ అభిప్రాయపడ్డారని, హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, న్యాయమూర్తులకు రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదని కేవలం వారి మనసులో భారత రాజ్యాంగం మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు.

First Published:  28 April 2023 9:09 PM IST
Next Story