మోస్ట్ పాపులర్ సీఎం.. నవీన్ పట్నాయక్
నవీన్ పట్నాయక్ 2000వ సంవత్సరం నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బిజూ జనతాదళ్ వ్యవస్థాపకుడైన బిజూ పట్నాయక్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ ఒడిశా ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉన్న నాయకుడు.
ఇండియాలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరు..? ఇదే ప్రశ్నతో ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సర్వేలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు అగ్ర స్థానంలో ఉన్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను వెనక్కినెట్టి ఆయన మొదటి స్థానంలోకి వచ్చారు.
మూడో స్థానంలో హిమంత్ బిశ్వశర్మ
52.7 శాతం ప్రజాదరణతో నవీన్ పట్నాయక్ అగ్రస్థానంలో, 51.3 స్థానంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలిచారు. అస్సాం సీంఎ హిమంత బిశ్వశర్మ 48.6% పాపులారిటీతో మూడో స్థానంలో ఉన్నారు. గుజరాత్ సీఎం భూపేష్ బగేల్ నాలుగో స్థానంలో, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా 5వ ప్లేస్‌లో నిలిచారు.
24 సంవత్సరాలుగా ఆయనే సీఎం
నవీన్ పట్నాయక్ 2000వ సంవత్సరం నుంచి ఒడిశా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బిజూ జనతాదళ్ వ్యవస్థాపకుడైన బిజూ పట్నాయక్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నవీన్ ఒడిశా ప్రజల్లో తిరుగులేని ఆదరణ ఉన్న నాయకుడు. అవివాహితుడైన ఆయన ఒడిశా ప్రయోజనాల కోసమే పనిచేసే వ్యక్తిగా ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తనంతట తాను విరమించుకుంటే తప్ప నవీన్ పట్నాయక్‌ను ఓడించే వ్యక్తి ఇప్పటికైతే ఒడిశా రాజకీయాల్లో లేరని చెబుతారు.