Telugu Global
National

ఎన్టీఆర్ నాణెం విడుదల.. స్టేజ్ పై చంద్రబాబుకి దక్కని చోటు

ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరంగా ఉండటం విశేషం. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నడ్డాతోపాటు చంద్రబాబు కూడా ప్రేక్షకుల నడుమ కూర్చున్నారు.

ఎన్టీఆర్ నాణెం విడుదల.. స్టేజ్ పై చంద్రబాబుకి దక్కని చోటు
X

ఎన్టీఆర్ నాణెం విడుదల.. స్టేజ్ పై చంద్రబాబుకి దక్కని చోటు

ఎన్టీఆర్ నాణెం విడుదల సందర్భంలో తాను సెంటరాఫ్ అట్రాక్షన్ కావాలని చంద్రబాబు విపరీతమై ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. వ్యూహాత్మకంగా లక్ష్మీపార్వతికి ఎంట్రీ లేకుండా చేశారు. కానీ చంద్రబాబుకి స్టేజ్ పై ఎంట్రీ లేకుండా పోయింది. కేవలం ఎన్టీఆర్ సంతానం మాత్రమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు స్టేజ్ పై కూర్చున్నారు. ఓవైపు ఎన్టీఆర్ కుమారులు, మరోవైపు ఎన్టీఆర్ కుమార్తెలు రాష్ట్రపతికి ఇరువైపులా కూర్చున్నారు. వీరందరి సమక్షంలో రాష్ట్రపతి.. ఎన్టీఆర్ స్మారకంగా రూపొందించిన రూ.100 నాణెం విడుదల చేశారు.

భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారక రామారావు ఎంతో ప్రత్యేకం అని, రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కృష్ణుడు, రాముడు వంటి పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అద్భుతమని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం ఆయన ఎంతో కృషి చేశారన్నారు. ఎన్టీఆర్ విలక్షణ వ్యక్తిత్వాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు రాష్ట్రపతి.


ఎన్టీఆర్ నాణెం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరంగా ఉండటం విశేషం. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నడ్డాతోపాటు చంద్రబాబు కూడా ప్రేక్షకుల నడుమ కూర్చున్నారు. నందమూరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.




First Published:  28 Aug 2023 12:13 PM IST
Next Story