Telugu Global
National

‘ఆర్‌ఆర్‌ఆర్’ కు ఆస్కార్‌ ఘనత మోడీదేనట.... కేంద్ర మంత్రి వక్కాణింపు

RRR మూవీ స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను కేంద్ర బీజేపీ సర్కార్ కొద్ది రోజుల ముందు రాజ్యసభకు నామినేట్ చేసింది. దాన్ని గుర్తు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభకు మోడీ ఎలాంటి వారిని నామినేట్ చేస్తారో , ఆ విషయంలో ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తారో 'RRR' కు ఆస్కార్ రావడమే గొప్ప ఉదహరణ అని ట్వీట్ చేశారు.

‘ఆర్‌ఆర్‌ఆర్’ కు ఆస్కార్‌ ఘనత మోడీదేనట.... కేంద్ర మంత్రి వక్కాణింపు
X

ముందు తిట్టడం, బెదిరించడం...ఆ తర్వాత నెత్తికెత్తుకోవడం బీజేపీకి కొత్తకాదు. అక్కడితో ఆగినా పర్వాలేదు. అవతలి వాళ్ళకు వచ్చిన క్రెడిట్ అంతా తమదే అని ప్రచారం చేసుకోవడంలో కూడా ముందుంటారు.

'RRR' మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం తమ గొప్పతనమే అని చెప్పుకోవడానికి బీజేపీ విచిత్ర విన్యాసాలు చేస్తున్నది.బీజేపీ ఇలా చేస్తుందన్న విషయాన్ని పలువురు రాజకీయ నాయకులు ముందే చెప్పారు కూడా. తెలంగాణ మంత్రి కేటీఆర్ నిన్న ట్వీట్ చేస్తూ మోడీ వల్లనే ఈ అవార్డు వచ్చిందని వాళ్ళు ప్రచారం మొదలు పెడ్తారని అన్నారు. ఈ రోజు పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ నాటు నాటు పాటకు లిరిక్స్ మోడీయే రాశారని దయచేసి చెప్పకండి అని బీజేపీ నాయకులను వ్యంగ్యంగా వేడుకున్నారు.

ఎవరెన్ని అనుకుంటే మాకేంటి అన్నట్టు బీజేపీ నాయకులు అన్నంత పని చేస్తూనే ఉన్నారు. RRR మూవీ స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను కేంద్ర బీజేపీ సర్కార్ కొద్ది రోజుల ముందు రాజ్యసభకు నామినేట్ చేసింది. దాన్ని గుర్తు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభకు మోడీ ఎలాంటి వారిని నామినేట్ చేస్తారో , ఆ విషయంలో ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తారో 'RRR' కు ఆస్కార్ రావడమే గొప్ప ఉదహరణ అని ట్వీట్ చేశారు.

పీయుష్ గోయల్ ట్వీట్ పై నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. అన్ని దారులు రోమ్ కే వెళ్తాయన్నట్టు ప్రపంచంలో ఏ మంచి జరిగినా మోడీకే క్రెడిట్ వెళ్తుంది. అని నెటిజనులు విమర్శలు చేస్తున్నారు.

ఆ అవార్డ్ కు మోస్కార్ అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అని క్రియేటివ్ డైరెక్టర్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ అయిన GS శ్రీధర్ కామెంట్ చేశారు.

విజయేంద్ర ప్రసాద్ మూవీ కథ రాశారు. ఆస్కార్ గెలిచిన నాటు నాటు పాట రాసింది ఆయన కాదు. లిరిక్, స్క్రిప్ట్ ల మధ్య వ్యత్యాసం పీయుష్ గోయల్ వంటి మంత్రికి అర్థం కావడం చాలా కష్టం. అని మరో నెటిజన్ విమర్శించారు.

First Published:  14 March 2023 5:34 PM IST
Next Story