Telugu Global
National

జబ్ ప్యార్ కియా తో డ‌ర్నా క్యా, నేను చావుకు భయపడను... ఒవైసీ

మీడియా ప్రతినిధులతో ఒవైసీ మాట్లాడుతూ.. ''ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, ప్రభుత్వాన్ని చట్టవ్యతిరేకంగా నడుపుతోందని, అక్కడ తుపాకీ పాలన నడుస్తోందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. నిన్న జరిగిన హత్యల్లో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం పాత్ర ఉంది.ఇది 'కోల్డ్ బ్లడెడ్' హత్య. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీని వేసి విచారణ జరపాలి.'' అని డిమాండ్ చేశారు.

జబ్ ప్యార్ కియా తో డ‌ర్నా క్యా, నేను చావుకు భయపడను... ఒవైసీ
X

ఉత్తర ప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్‌ అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ ల‌ హత్య నేపథ్యంలో యూపీ శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్ ఐ ఎమ్ ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. మతోన్మాదాన్ని అడ్డుకుంటానని, ప్రాణాలు పోయినా పర్వాలేదు తాను ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తానని ఆయన అన్నారు.

ఆదివారం ఉదయం మీడియా ప్రతినిధులతో ఒవైసీ మాట్లాడుతూ.. ''ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని చట్టవ్యతిరేకంగా నడుపుతోందని, అక్కడ తుపాకీ పాలన నడుస్తోందని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. నిన్న జరిగిన హత్యల్లో ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం పాత్ర ఉంది.ఇది 'కోల్డ్ బ్లడెడ్' హత్య. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీని వేసి విచారణ జరపాలి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏ అధికారిని ఆ కమిటీలో చేర్చకూడదు. ." అని అన్నాడు, “నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను... రాడికలైజేషన్ ఆపాలి. నేను తప్పకుండా ఉత్తరప్రదేశ్ సందర్శిస్తాను, నేను భయపడను. జబ్ ప్యార్ కియా తో డ‌ర్నా క్యా ( ప్రేమించినప్పుడు ఎందుకు భయపడాలి) ఈ హత్యను పండుగ జరుపుకునే వ్యక్తులు రాబందులు" అని ఆయన అన్నారు.

“వారికి (హంతకులకు) ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి?... ఆ దుండగులు హత్య చేసిన తర్వాత‌ మతపరమైన నినాదాలు ఎందుకు చేశారు? వారిని ఉగ్రవాదులు అనకపోతే ఏమంటారు? వారిని దేశభక్తులు అంటారా? ఈ సంఘటనను పండుగ జరుపుకునే వ్యక్తులు రాబందులు…” అని ఆయన అన్నారు.

ఈ ఘటన తర్వాత దేశంలోని రాజ్యాంగం, శాంతిభద్రతలపై ప్రజలకు విశ్వాసం ఉంటుందా అని ఓవైసీ ప్రశ్నించారు.

''ఈ సంఘటనపై మీరు ఏమైనా మాట్లాడుతారా లేదా అని నేను దేశ ప్రధానిని అడగాలనుకుంటున్నాను. అని ఆయన అన్నారు. ‘మేరీ సుపారీ లి గయీ హై’ అని ప్రధాని తన ప్రసంగంలో చెప్పారు. ఇప్పుడు మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న చోట బహిరంగంగా హత్యలు జరుగుతున్నాయి. నిన్నటి సంఘటన తర్వాత భారతదేశంలోని ప్రతి పౌరుడు అసురక్షితంగా భావిస్తున్నాడు.'' అని ఒవైసీ పేర్కొన్నారు.

“యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని, ఈ అంశంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అద్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని నేను డిమాండ్‌ చేస్తున్నాను. అక్కడ ఉన్న పోలీసు అధికారులందరినీ సర్వీసు నుండి తొలగించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. ”అని ఓవైసీ అన్నారు.

“అతిక్ , అతని సోదరుడు పోలీసుల అదుపులో ఉన్నారు. వారిద్దరికి సంకెళ్లు వేశారు. వారిద్దరిని హత్య చేసిన దుండగులు జై శ్రీరామ్ అని నినాదాలు కూడా చేశారు. ఆ ఇద్దరిని చంపడం యోగి లా అండ్ ఆర్డర్ వ్యవస్థ వైఫల్యం. ఎన్‌కౌంటర్ రాజ్‌ను నడిపే వారే ఈ హత్యకు బాధ్యులు' అని ఒవైసీ అన్నారు.

First Published:  16 April 2023 11:16 AM GMT
Next Story