ఇరాన్ మహిళలకుమద్దతుగా జుత్తు కత్తిరించుకున్న భారత్ మహిళ
ఇరాన్ మహిళల పోరాటానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలో ఓ మహిళ ఇరాన్ మహిళలకు మద్దతుగా జుత్తు కత్తిరించుకొని వార్తల్లోకి ఎక్కింది.
సెప్టెంబరు 17న 22 ఏళ్ల మహ్సా అమినీ మరణం తర్వాత ఇరాన్ లో పెద్ద ఎత్తున హిజాబ్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. పోలీసుల దాడులు, కాల్పులు నేపథ్యంలో నఏక మంది మరణిస్తున్నా, వేల మందిని జైళ్ళలో నెడుతున్నా ఇరాన్ మహిళలు తెగించి పోరాడుతున్నారు. మహిళలు, హిజాబ్ ను కాల్చేయడం, జుత్తు కత్తిరించుకోవడం ఇప్పుడా ఉద్యమానికి ఓ గుర్తులా మారిపోయింది. నిరసనలు కనీసం 50 ఇరాన్ నగరాలు, పట్టణాలు,గ్రామాలలో వ్యాపించాయి.
ఇరాన్ మహిళల పోరాటానికి మద్దతుగా ప్రపంచవ్యాప్తంగా సంఘీభావ ఉద్యమాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనదేశంలో ఓ మహిళ ఇరాన్ మహిళలకు మద్దతుగా జుత్తు కత్తిరించుకొని వార్తల్లోకి ఎక్కింది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో డాక్టర్ అనుపమ భరద్వాజ్ అనే మహిళ ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు తమ మద్దతును తెలుపుతూ తన జుట్టును కత్తిరించుకుంది.
కొద్ది రోజులుగా వివిధ దేశాల్లో మహిళలు ఇలా జుట్టు కత్తిరించుకొని ఇరాన్ మహిళలకు మద్దతు పలుకుతున్నారు. టర్కీ గాయని మెలెక్ మోస్సో వేదికపై జుట్టు కత్తిరించుకొని నిరస తెలపగా, చాలా మంది ఫ్రెంచ్ కళాకారులు కూడా ఇరాన్ మహిళలకు మద్దతుగా నిలిచారు.