'ఇకపై సార్, మేడమ్ అని పిలవొద్దు'
విద్యాసంస్థల్లో లింగ-తటస్థ నిబంధనలను ప్రోత్సహించాలని, 'సర్' మరియు 'మేడమ్' అని సంబోధిస్తున్నప్పుడు వివక్ష పెరుగుతుందని ఈ వివక్షను అంతం చేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన అభ్యర్థనను బాలల హక్కుల ప్యానెల్ పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలిచ్చింది.
విద్యాసంస్థల్లో ఇకపై సార్, మేడమ్ అని పిలవొద్దని కేరళ స్టేట్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (KSCPCR) ఆదేశాలు జారీ చేసింది. ఉపాధ్యాయుడిని సార్ అని ఉపాధ్యాయురాలిని మేడమ్ అని పిలవడం మానేయలని, అందరినీ టీచర్ అని మాత్రమే పిలవాలని కమీమిషన్ ఆదేశాలిచ్చింది.
విద్యార్థి దశలోనే పిల్లలకు స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే అనే భావం పెంపొందించేందుకు ఇది అవసరమని KSCPCR పేర్కొంది. అన్ని పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈ విధమైన మార్గదర్శకాలు జారీ చేయాలని KSCPCR విద్యాశాఖకు ఆదేశాలిచ్చింది.
విద్యాసంస్థల్లో లింగ-తటస్థ నిబంధనలను ప్రోత్సహించాలని, 'సర్' మరియు 'మేడమ్' అని సంబోధిస్తున్నప్పుడు వివక్ష పెరుగుతుందని ఈ వివక్షను అంతం చేయాలని కోరుతూ ఒక వ్యక్తి దాఖలు చేసిన అభ్యర్థనను బాలల హక్కుల ప్యానెల్ పరిగణనలోకి తీసుకొని ఈ ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘టీచర్’ అనే పదాన్ని ఉపయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్యానెల్ చైర్‌పర్సన్ కేవీ మనోజ్ కుమార్, సభ్యుడు సీ విజయకుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విద్యాశాఖను ఆదేశించింది. సార్ లేదా మేడమ్ అని కాకుండా "టీచర్" అని పిలవడం అన్ని పాఠశాలల పిల్లల మధ్య సమానత్వాన్ని కొనసాగించడంలో సహాయపడుతుందని, ఉపాధ్యాయులతో వారి అనుబంధాన్ని కూడా పెంచుతుందని కమిషన్ అభిప్రాయపడింది.
కాగా 2021లో ఉత్తర కేరళ జిల్లాలోని మాథుర్ గ్రామ పంచాయితీ దేశంలోనే మొదటి సారి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో 'సర్' లేదా 'మేడమ్' వంటి పదాలను ఉపయోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.