Telugu Global
National

భూమి మీదున్న ఏ శక్తీ 'ఆర్టికల్‌ 370'ని తిరిగి తీసుకురాలేదు: ప్రధాని

జమ్ముకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతి శక్తినీ ఓడించి తీరుతామని ప్రధాని పేర్కొన్నారు.

భూమి మీదున్న ఏ శక్తీ ఆర్టికల్‌ 370ని తిరిగి తీసుకురాలేదు: ప్రధాని
X

ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం స్థానికంగా వేర్పాటువాదం, ఉగ్రవాదం తగ్గుముఖం పట్టాయని.. త్వరలోనే వాటికి చరమగీతం పాడుతామని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్‌ అజెండాను అమలు కానివ్వమన్న ప్రధాని భూమి మీదున్న ఏ శక్తీ ఆర్టికల్ 370ను తిరిగి తీసుకురాలేదన్నారు. జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కటడాలో నిర్వహించిన పాల్గొన్న ప్రధాని మోడీ విపక్షాలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌లు తమ పాలనలో జమ్ముకశ్మీర్‌ నుంచి నది జలాలను పాకిస్థాన్‌లోకి వెళ్లనిచ్చారు. తాము ఆనకట్టలు కట్టి నీటిని సద్వినియోగం చేసినట్లు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌కు అనేక పరిశ్రమలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో కశ్మీర్‌లో హిందువులు, సిక్కులపై దాడులు జరిగాయి. మేం వచ్చాక జమ్ముకశ్మీర్‌ రూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఖేలో ఇండియా వింటర్‌ గేమ్స్ జమ్ముకశ్మీర్‌లో నిర్వహిస్తున్నామని ప్రధాని తెలిపారు.శ్రీనగర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ. విద్యకు దూరమైన మన యువత చేతిలో కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ పార్టీలు రాళ్లు పెడుతున్నాయని ప్రధాని విమర్శించారు. వారి స్వప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌పై కుట్రలు చేసే ప్రతి శక్తినీ ఓడించి తీరుతామని ప్రధాని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. బుధవారం తొలి విడుత పోలింగ్‌ ముగిసిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్‌, కాంగ్రెస్‌ ఒకే తాను ముక్కలే: అమిత్‌ షా

జమ్ముకశ్మీర్‌ ఎన్నికల నేపథ్యంలో ఆర్టికల్‌ 370పై పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ విషయంలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌-నేషనల్‌ కాంగ్రెస్‌ కూటమిది ఒకే మాట అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పాకిస్థాన్‌, కాంగ్రెస్‌ ఒకే తాను ముక్కలే అని ఎక్స్‌ వేదికగా విమర్శలు చేశారు. ఖావాజా ఆసీఫ్‌ వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. పాకిస్థాన్‌, కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ఒకే గొంతుక వినిపిస్తాయని, హస్తం పార్టీ ఎప్పుడూ దేశ వ్యతిరేకశక్తులతో చేతులు కలిపి ఉంటుందని ఆరోపించారు.

First Published:  20 Sept 2024 12:21 AM GMT
Next Story