కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. ఒంటరిగానే పోటీ
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతబలంతోనే ముందుకు వెళ్లనున్నదని కేజ్రీవల్ వెల్లడి
వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి పార్టీలు ఆప్, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల మధ్య పొత్తు చర్చలు చివరి దశకు వచ్చినట్లు, అవి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సొంతబలంతోనే ముందుకు వెళ్లనున్నది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఆప్-కాంగ్రెస్‌ల మధ్య పొత్తు దిశగా అడుగులు పడుతున్నాయని, కాంగ్రెస్‌కు 15 స్థానాలు కేటాయించేలా చర్యలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. 1-2 స్థానాలు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించనున్నట్లు పేర్కొనగా.. వాటిని కేజ్రీవాల్ తాజాగా తోసిపుచ్చారు. ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ అబ్యర్థులతో కూడిన రెండు జాబితాలను ఆప్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండు విడతల్లో 31 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.