Telugu Global
National

ఎండల‌తో అల్లాడిపోతున్న ప్రజలకు 'చల్లని' వార్త చెప్పిన వాతావరణ శాఖ‌

తమిళనాడు, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా, ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని IMDపేర్కొంది.

ఎండల‌తో అల్లాడిపోతున్న ప్రజలకు చల్లని వార్త చెప్పిన వాతావరణ శాఖ‌
X

మండే ఎండలతో, వడగాల్పులతో అల్లాడిపోతున్న భారతీయులకు వాతావరణ శాఖ తాజాగా 'చల్లని' కబురు వినిపించింది.

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో రాబోయే నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వడగాల్పులు కూడా ఉండవని వాతావరణ శాఖ తెలిపింది.

IMD తన సూచనలో రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు-మధ్య, ఈశాన్య భారతదేశం, ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో వాతావరణం తడిగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న ఐదు రోజులపాటు ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకోనున్నారు.

తమిళనాడు, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఫలితంగా, ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని పేర్కొంది. దక్షిణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్, యూపీ, పంజాబ్, తదితర రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన గాలి వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఈశాన్య భారతదేశంలో రానున్న మూడు రోజులలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజుల్లో తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లతో సహా భారతదేశంలోని మధ్య ప్రాంతాలలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే నెలకొంటాయని IMD తెలిపింది.

First Published:  23 April 2023 9:45 AM IST
Next Story