బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరి తొలగింపు
బీజేపీ పార్లమెంటరీ బోర్డును పునర్వవస్థీకరించినట్లు ఆ పార్టీ పేర్కొన్నది. ఇప్పటి వరకు పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నది.
బీజేపీ పార్లమెంటరీ బోర్డును పునర్వవస్థీకరించినట్లు ఆ పార్టీ పేర్కొన్నది. ఇప్పటి వరకు పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లను తొలగిస్తున్నట్లు పేర్కొన్నది. బీజేపీలో అత్యున్నత కమిటీగా భావించే పార్లమెంటరీ బోర్డు నుంచి వీరిద్దరినీ ఎందుకు తొలగించారో మాత్రం పేర్కొనలేదు. రాబోయే రెండేళ్లలో కీలక రాష్ట్రాలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్లమెంటరీ బోర్డును పునర్వవస్థీకరించినట్లు తెలుస్తున్నది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్లమెంటరీ బోర్డుకు హెడ్‌గా కొనసాగనున్నారు. ఇక పీఎం నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా కూడా పార్లమెంటరీ బోర్డులో కొనసాగుతారని పార్టీ ప్రకటించింది. అయితే ఈ సారి కొంత మంది కొత్త వారికి బోర్డులో చోటు కల్పించింది.
తెలంగాణకు చెందిన డాక్టర్ కే. లక్ష్మణ్‌కు పార్లమెంటరీ బోర్డులో చోటు దక్కింది. కర్నాటక మాజీ సీఎం బీఎస్ యాడియురప్ప, సర్బానంద సోన్వాల్ (అస్సాం), సుధా యాదవ్ (హర్యాణా), బీఎల్ సంతోశ్ (కర్నాటక), సత్యనారాయణ జతియా (మధ్యప్రదేశ్), ఇక్బాల్ సింగ్ లాల్‌పుర (పంజాబ్)లకు కొత్తగా బోర్డులో చోటు కల్పించారు.