Telugu Global
National

ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రధాని

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న మోడీ

ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రధాని
X

ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పటల్‌కు వెళ్లారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా 'ఎక్స్‌'లో పోస్టు చేశారు. జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆరోగ్యంగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆదివారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ను ఆస్పత్రిలో చేర్పించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయనను ఎయిమ్స్‌లోని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సీసీయూ)లో ఉంచి కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ రాజీవ్‌ నారంగ్‌ ఆధ్వర్యంలో చికిత్స అందిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ప్రధాని మోడీ హాస్పిటల్‌కు వెళ్లి ఆరోగ్యంపై ఆరా తీశారు. మరోవైపు ఉదయాన్నే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హాస్పిటల్‌కు వెళ్లి ఉప రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

First Published:  9 March 2025 3:53 PM IST
Next Story