Telugu Global
National

కదులుతున్న రైలు కింద పడబోయిన మహిళ

అప్రమత్తంగా వ్యవహరించి మహిళను రక్షించిన రైల్వే పోలీస్‌

కదులుతున్న రైలు  కింద పడబోయిన మహిళ
X

కదులుతున్న రైలు నుంచి ప్లాట్ ఫారమ్‌పైకి దిగడానికి యత్నించిన ఓ మహిళ రైలు కింద పడిపోయే సమయంలో అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆమెను రక్షించిన ఘటన ముంబయిలోని బోరివలి స్టేషన్‌లో చోటు చేసుకున్నది. ఘటనకు సంబంధిచిన వీడియోను భారత రైల్వే మంత్రిత్వ శాఖ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. రైల్వే పోలీస్‌ చేసిన సాయాన్ని 'మిషన్‌ జీవన్‌ రక్ష'గా అభివర్ణించింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

మహారాష్ట్రలోని బోరివలి స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతున్నప్పుడు ఒక మహిళ బ్యాలెన్స్‌ కోల్పోయి రైలు-ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోయింది. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి ఆమెను పైకి లాగడంతో ప్రమాదం తప్పింది. ఆయన చర్య అభినందనీయం. ప్రజలు రైళ్లలో ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి మా సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని రైల్వేశాఖ పేర్కొన్నది.

First Published:  9 March 2025 2:35 PM IST
Next Story