Telugu Global
National

రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్గీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరుపై ఫైర్‌

రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్డు మండిపడింది. ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్గీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నా. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే అలా అడ్డుకోరనే విషయాన్ని వారికి తెలియజేయాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీకి సూచించారు.

దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి వ్యతిరేకంగా దాఖలైన వాజ్యంపై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిరవధిక దీక్షను కొనసాగిస్తున్న దల్లేవాల్‌కు వైద్య సహాయం అందేలా చూడాలని తాము పంజాబ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని.. అయితే వాటిని అమలు చేయయడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలపై అత్యున్నత న్యాయస్థానం సంతృప్తి చెందలేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

ఈ విషయంలో పంజాబ్‌ రాష్ట్రానికి ఏదైనా సాయం అవసరమైతే, కేంద్రం మద్దతివ్వాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంర్‌ 31న చేపట్టనున్నట్లు వెల్లడించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబర్‌ 26 నుంచి జగ్గీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పంజాబ్‌-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద నిరవధిక నిరసన దీక్ష చేపట్టిన విషయం విదితమే.

First Published:  28 Dec 2024 1:22 PM IST
Next Story