న్యూ ఇయర్.. ఫస్ట్ డే.. ఫస్ట్ షాక్..!
దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి.
నూతన సంవత్సరం తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. 19 కేజీలు ఉండే ఈ గ్యాస్ సిలిండర్‌కు రూ.25 చొప్పున ధర పెంచుతూ కంపెనీలు నిర్ణయించాయి.
గృహావసరాలకు వినియోగించే గ్యాస్ ధర మాత్రం పెరగలేదు. అవి స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో రూ.1769, ముంబైలో రూ.1721, కోల్‌కతాలో రూ.1870, చెన్నైలో రూ.1917, హైదరాబాద్‌లో రూ.1973గా ఉన్నాయి.
ప్రస్తుతం గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. చివరిసారిగా గతేడాది జూలై 6న రూ.50 చొప్పున వీటి ధరలు పెరగగా, గతేడాదిలో మొత్తంగా చూస్తే గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.153.5 పెరిగాయి.
గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల ధరలు దేశంలోని వివిధ ప్రముఖ నగరాల్లో ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో రూ.1053, ముంబైలో రూ.1052, కోల్‌కతాలో రూ.1079, చెన్నైలో రూ.1068, హైదరాబాద్‌లో రూ.1105 చొప్పున ఉన్నాయి.