దేశంలో కొత్త రకం బ్యాంకింగ్ వైరస్! ఈ జాగ్రత్తలు మస్ట్!
సోవా వైరస్‌ను తొలిసారిగా 2021 సెప్టెంబరులో గుర్తించారు. ఇది ఫేక్ ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా మొబైల్‌లోకి ఎంటర్ అవుతుంది. సైబర్ నేరగాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా ఈ మాల్‌వేర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది.
సైలెంట్‌గా ఆండ్రాయిడ్ ఫోన్లలోకి చొరబడి.. యూజర్ల బ్యాంకింగ్ వివరాలను చోరీ చేసే కొత్తరకం బ్యాకింగ్ వైరస్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. 'సోవా' అని పిలిచే ఈ వైరస్ యూజర్ల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు చేరవేస్తుంది. ఒకసారి మొబైల్‌లోకి ఈ వైరస్ చొరబడితే.. దాన్ని వదిలించుకోవడం అంత సులువు కాదని సైబర్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ వైరస్ బారిన పడుకుండా ఉండేందుకు ఏం చేయాలంటే..
సోవా వైరస్‌ను తొలిసారిగా 2021 సెప్టెంబరులో గుర్తించారు. ఇది ఫేక్ ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా మొబైల్‌లోకి ఎంటర్ అవుతుంది. సైబర్ నేరగాళ్లు పంపే లింక్‌లపై క్లిక్ చేయడం ద్వారా ఈ మాల్‌వేర్ ఫోన్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ వినియోగదారుల బ్యాంకింగ్ యాప్‌లు/బ్యాంకు ఖాతాల యూజర్ నేమ్‌లు, పాస్‌వర్డులన్నింటినీ దొంగిలిస్తుంది. ఆఖరికి డిజిటల్ వ్యాలెట్లు, క్రిప్టో కరెన్సీని కూడా ఇది లూటీ చేయగలదు. ఈ వైరస్ గూగుల్ క్రోమ్, అమెజాన్ వంటి ప్రముఖ యాప్‌ల లోగోలను వాడుకుంటుంది. యూజర్లు అవి నిజమైన యాప్స్ అనుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే మోసపోయే ప్రమాదముంది.
యూజర్లు సోవా వైరస్ బారినపడకుండా ఉండేందుకు ఫోన్‌లోని యాప్స్‌ను రీచెక్ చేసుకోవాలి. ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను వాడకూడదు. అలాగే మెసేజ్‌ల ద్వారా వచ్చే లింక్స్‌ను క్లిక్ చేయకూడదు. వీటితో పాటు నెట్ బ్యాంకింగ్ యాప్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. ట్రస్టెడ్ వైఫై నెట్‌వర్క్‌కు మాత్రమే మొబైల్‌ను కనెక్ట్ చేయాలి.