కొత్త ఉద్యోగాలు, శాలరీ హైక్‌లు.. ఉద్యోగులకు శుభశకునాలే!
మాన్‌పవర్ కంపెనీ దేశంలోని 3,150 కంపెనీలతో సర్వే నిర్వహించింది. కొత్తగా జాబ్‌లు వేయడం, జీతభత్యాల పెంపు వంటి అంశాలపై ప్రశ్నలడిగింది.
వచ్చే నెలలో ప్రారంభం కానున్న 2024-25 ఆర్థిక సంవత్సరం భారతీయ యువతకు, ముఖ్యంగా నిరుద్యోగులకు శుభవార్తలే ఉంటాయని మాన్‌పవర్ గ్రూప్ అంచనా వేస్తోంది. రాబోయే మూడు నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొత్త నియామకాలకు 36 శాతం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా శాలరీ హైక్ వంటి ప్రోత్సాహకాలు లభిస్తాయని తమ సర్వేలో తేలినట్లు చెప్పింది.
3,150 కంపెనీలతో సర్వే
మాన్‌పవర్ కంపెనీ దేశంలోని 3,150 కంపెనీలతో సర్వే నిర్వహించింది. కొత్తగా జాబ్‌లు వేయడం, జీతభత్యాల పెంపు వంటి అంశాలపై ప్రశ్నలడిగింది. ఇందులో 36 శాతం కంపెనీలు కొత్తగా జాబ్‌లు వేసి, ఉద్యోగులను చేర్చుకుంటామని చెప్పినట్లు వెల్లడించింది. ఇది లాస్ట్ ఇయర్ ఇదే టైమ్‌తో పోల్చితే ఏకంగా 6 శాతం ఎక్కువ. ఈ పర్సంటేజ్ రానున్న ఆర్థిక సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యధికం కావచ్చని పేర్కొంది. కొత్త నైపుణ్యాలున్న వారికోసం కంపెనీలు రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లు నిర్వహించబోతున్నాయని చెప్పింది.
జీతాలు పెంచుతామన్న 50% కంపెనీలు
కాగా, ఈ సర్వేల్లో పాల్గొన్న కంపెనీల్లో 50 శాతం కంపెనీలు వచ్చే రెండు, మూడు నెలల్లోనే జీతాలు పెంచుతామని చెప్పాయి. 33 శాతం కంపెనీలు శాలరీల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని చెప్పాయి.