Sonu Sood: రియల్ హీరోవి అయి ఉండి నీకిది తగునా..? సోనూసూద్ చేసిన పనికి నెటిజన్ల విమర్శలు
Sonu Sood train video: సోనూసూద్ ట్రైన్ ఫుట్ బోర్డుపై కాలి ముని వేళ్లపై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించాడు. మధ్య మధ్యలో బయటకు తొంగిచూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్లు సోనూసూద్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు.
కరోనా టైంలో ప్రముఖ నటుడు సోనూసూద్ చేసిన సేవలు ఆయన్ని రియల్ హీరోని చేశాయి. కష్టం ఎక్కడుంటే.. అక్కడ సోనూసూద్ వాలిపోయేవాడు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేవాడు. కరోనా సమయంలో తన ఆస్తిలో ఎంతో మొత్తాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టాడు ఈ నటుడు. ప్రజల హృదయాల్లో రియల్ హీరోగా మిగిలిన సోనూసూద్ తాజాగా చేసిన ఓ పనికి నెటిజన్ల నుంచి సుతి మెత్తగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
— sonu sood (@SonuSood) December 13, 2022
తాజాగా ఓ ట్రైన్ ఫుట్ బోర్డుపై ప్రయాణించిన సోనూసూద్ ఆ వీడియోను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోను సోనూసూద్ అలా పోస్ట్ చేయగానే అది వైరల్ అయ్యింది. అయితే వీడియోలో సోనూసూద్ ట్రైన్ ఫుట్ బోర్డుపై కాలి ముని వేళ్లపై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించాడు. మధ్య మధ్యలో బయటకు తొంగిచూస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన నెటిజన్లు సోనూసూద్ ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు.
You have millions of fan following ... In case they arent careful enough like you while copying your act .... It could be risky for them... You are the most admired celebrity around... & you can't be doing this for others safety!! ✨
— Anish Nair (@anishnair1010) December 13, 2022
'కరోనా టైంలో ప్రజలకు ఎంతో సేవ చేసి రియల్ హీరోగా మారావు. మిమ్మల్ని ఎంతో మంది అనుసరిస్తుంటారు. ఇలా ట్రైన్‌లో ఫుట్ బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణిస్తే మిమ్మల్ని చూసి మరికొందరు ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది' అని కొందరు విమర్శించారు. 'మిమ్మల్ని చూసి ఇటువంటి వీడియోలు చేసుకునేందుకు యువత పోటీపడే అవకాశం ఉంది. ఆ ప్రయత్నంలో వారు ప్రమాదం బారిన పడే ఛాన్స్ ఉంది. బాధ్యత గల నటుడు అయిన మీరు మరోసారి ఇలా చేయొద్దు ' అని మరికొందరు కామెంట్స్ చేశారు.
Being a role model for many across the country, you should NOT post or encourage such videos!
— Anupam | अनुपम (@AnupamConnects) December 13, 2022
If your enthusiastic fans start making videos sitting at the open entrance of a running train, it will put their lives in serious danger.
ఇంకొందరు నెటిజన్లు అయితే ట్రైన్ లో ప్రమాదకరంగా ప్రయాణించడంతోపాటు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోనూసూద్ పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కొన్నేళ్లుగా తను చేసే మంచి పనుల ద్వారా పొగడ్తల వర్షం కురిపించుకున్న సోనూసూద్ తాజాగా చేసిన పనికి విమర్శల పాలు కావడం గమనార్హం.