కరెన్సీ నోట్లపై గాంధీ ఫోటో స్థానంలో నేతాజీ ఫోటో :వివాదం రేపుతున్న హిందూ మహాసభ డిమాండ్!!
కరెన్సీ నోట్ల పై గాంధీ చిత్రం స్థానంలో నేతాజీ చిత్రం ఉండాలని అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి డిమాండ్ చేశారు. దసరా పండగ సందర్భంగా చెలరేగిన ఈ అసుర వివాదం సద్దుమణుగుతుండగానే హిందూ మహా సభ ఈ కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ఉండాలంటూ కొత్త వివాదాన్నిరాజేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.
అఖిల భారత హిందూ మహాసభ మరోసారి పాత వివాదాన్ని తెరపైకి తెచ్చింది. కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని ముద్రించాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
"నేతాజీ గొప్ప స్వాతంత్య్ర సమర యోధుడు. స్వతంత్య్ర పోరాటంలో ఆయన గాంధీతో సమానంగా అంత కన్నా గొప్ప పాత్ర పోషించాడని మేము నమ్ముతున్నాము. అటువంటి గొప్ప వ్యక్తిని ఈ విధంగా గౌరవించుకోవడం సముచితంగా ఉంటుందని మేము భావిస్తున్నామని" పేర్కొంది.
కరెన్సీ నోట్ల పై గాంధీ చిత్రం స్థానంలో నేతాజీ చిత్రం ఉండాలని అఖిల భారత హిందూ మహాసభ పశ్చిమ బెంగాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రచూర్ గోస్వామి డిమాండ్ చేశారు.
కోల్‌కతా దుర్గా పూజ మండపంలో మహాత్మా గాంధీని పోలి ఉండేలా ఒక హిందూ గ్రూప్ మహిషాసురుని బొమ్మను ఉంచడంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే దీనిపై సర్వత్రా తీవ్ర ఆగ్రహవేశాలు, అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతోఈ చర్యను ఖండిస్తూ.. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు..దీన్ని వివాదం చేయద్దంటూ ఆ హిందూ గ్రూపు పేర్కొంది.
దసరా పండగ సందర్భంగా చెలరేగిన ఈ అసుర వివాదం సద్దుమణుగుతుండగానే హిందూ మహా సభ ఈ కరెన్సీ నోట్లపై నేతాజీ బొమ్మ ఉండాలంటూ కొత్త వివాదాన్నిరాజేస్తోందనే విమర్శలు వస్తున్నాయి.