Telugu Global
National

96.88 కోట్ల ఓట‌ర్లున్నార‌ని ఈసీ ప్ర‌క‌ట‌న‌.. ఇక ఎల‌క్ష‌న్ నోటిఫికేష‌నే త‌రువాయి

ఓటింగ్‌కు సుమారు 97 కోట్ల (96.88 కోట్లు) మంది అర్హులని తెలిపింది. 18 నుంచి 29 ఏళ్ల లోపు వయసున్న 2 కోట్ల మందికి పైగా యువ ఓటర్లను కొత్త‌గా జాబితాలో చేర్చినట్టు ఈసీ ప్ర‌క‌టించింది

96.88 కోట్ల ఓట‌ర్లున్నార‌ని ఈసీ ప్ర‌క‌ట‌న‌.. ఇక ఎల‌క్ష‌న్ నోటిఫికేష‌నే త‌రువాయి
X

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్‌ స‌మావేశాలే 17వ లోక్‌స‌భకు చివ‌రివి. బ‌డ్జెట్ స‌మావేశాలు ముగిసిన వెంట‌నే ఏ క్ష‌ణ‌మైనా లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవ‌కాశాలున్నాయి. ఏప్రిల్‌, మే నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గొచ్చ‌ని భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దేశంలో అర్హులైన ఓటర్ల సంఖ్యను ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రకటించింది. దీంతో ఇక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌ట‌మే త‌రువాయి అని తేలిపోయింది.

2 కోట్ల మంది కొత్త ఓట‌ర్లు

ఓటింగ్‌కు సుమారు 97 కోట్ల (96.88 కోట్లు) మంది అర్హులని తెలిపింది. 18 నుంచి 29 ఏళ్ల లోపు వయసున్న 2 కోట్ల మందికి పైగా యువ ఓటర్లను కొత్త‌గా జాబితాలో చేర్చినట్టు ఈసీ ప్ర‌క‌టించింది. అయిదేళ్ల కింద‌ట జ‌రిగిన‌ లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి రిజిస్టర్ అయిన ఓటర్ల సంఖ్య 6 శాతం పెరిగింది.

వ‌ర‌ల్డ్‌లో మ‌న‌మే టాప్‌

96.88 కోట్ల మంది ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నార‌ని ఈసీ 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. ఇది ప్ర‌పంచంలోనే ఓట‌ర్ల సంఖ్య‌ప‌రంగా అత్య‌ధికం కావ‌డం విశేషం.

First Published:  9 Feb 2024 8:15 PM IST
Next Story