Telugu Global
National

ఎన్డీఏ అంటే 'నో డేటా అవైలబుల్'.. కొత్త అర్థం చెప్పిన రాహుల్..

నో డేటా - నో ఆన్సర్ - నో అకౌంటబులిటీ అంటూ ఎన్డీఏ సర్కారుపై విరుచుకుపడ్డారు.

ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్.. కొత్త అర్థం చెప్పిన రాహుల్..
X

ఎన్డీఏ ప్రభుత్వం వద్ద ఏ సమాచారం ఉండదు అంటూ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నలను దాటవేస్తున్నారే కానీ, వాటికి సరైన సమాధానాలు చెప్పడంలేదని అన్నారు రాహుల్. NDA అంటే నో డేటా అవైలబుల్ గవర్నమెంట్ అని అన్నారు రాహుల్.

- ఆక్సిజన్ కొరత వల్ల భారత్ లో ఎవరూ చనిపోలేదు

- ఆందోళనలల్లో ఏ రైతూ చనిపోలేదు

- కరోనా కాలంలో వలస కూలీలెవరూ మార్గమధ్యంలో చనిపోలేదు

- మూక దాడుల్లో కూడా ఎవరూ చనిపోలేదు

- దేశంలో ఒక్క జర్నలిస్ట్ కూడా అరెస్ట్ కాలేదు

ఇవీ ఎన్డీఏ చెప్పే సమాధానాలు అంటూ ట్విట్టర్లో సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. కరోనా కాలంలో వలస కూలీలు కాలినడకన సొంత ప్రాంతాలకు వెళ్లలేక మరణించినా, ఆ డేటా ప్రభుత్వం తమ వద్ద లేదంటుందని, దబాయిస్తే అసలెవరూ చనిపోలేదని బుకాయిస్తుందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. నో డేటా - నో ఆన్సర్ - నో అకౌంటబులిటీ అంటూ ఎన్డీఏ సర్కారుపై విరుచుకుపడ్డారు.


కేటీఆర్ అప్పుడే చెప్పారు..

గతేడాది డిసెంబర్ లోనే కేటీఆర్ ఎన్డీఏ సర్కారుకి ఈ నిర్వచనం ఇచ్చారు. నో డేటా అవైలబుల్ సర్కార్ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ అప్పట్లో వైరల్ గా మారింది. ఆ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే ట్వీట్ వేశారు. కేంద్రం వద్ద ప్రజలు, ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలే ఉండవని చెప్పారు.

First Published:  23 July 2022 4:31 PM IST
Next Story