Telugu Global
National

జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి హవా.. హర్యానాలో హోరాహోరీ

హర్యానాలో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు తారుమారు

జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ కూటమి హవా.. హర్యానాలో హోరాహోరీ
X

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు మారుతున్నాయి. హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఫలితాలు ఎగ్జిట్‌పోల్స్‌ భిన్నంగా కనిపిస్తున్నాయి. హంగ్‌ తప్పదన్న జమ్మూలో నేషనల్‌ కాన్ఫరెన్స్-కాంగ్రెస్‌ కూటమి మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటేసింది. ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం ఎన్సీ కూటమి హవా కొనసాగుతున్నది. ఎన్సీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నది. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 41, కాంగ్రెస్‌ 9 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. బీజేపీ 24 చోట్ల ముందంజలో ఉన్నది. మొత్తం 90 స్థానాలున్న ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 46. ఒకవేళ ఐదుగురు నామినేటెడ్‌ ఎమ్మెల్యేలకు ఎల్జీ ఓటు హక్కు ఇస్తే ఆ సంఖ్య 48కి చేరుతుంది. ఈ సంఖ్యను కూడా ఎన్సీ కూటమి దాటేసింది.

హర్యానాలో హస్తం పార్టీకి తిరుగులేదన్న అన్ని ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తారుమారయ్యాయి. ప్రారంభంలో ఆధిక్యంలో కనిపించిన కాంగ్రెస్‌ ప్రస్తుతం వెనుకబడింది. బీజేపీ క్రమంగా పుంజుకుంటున్నది. హర్యానాలో మ్యాజిక్‌ ఫిగర్‌కు దగ్గరగా చేరుకున్నది. ఇక ఆరంభంలో 40 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం 40 లోపే ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం.

First Published:  8 Oct 2024 10:58 AM IST
Next Story