Telugu Global
National

రేపు జైలు నుంచి విడుదల కానున్న నవజ్యోత్ సింగ్ సిద్దూ

పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన 59 ఏళ్ల సిద్దూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేలో ఒక సంవత్సరం కఠినమైన జైలు శిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తవ్వడంతో సిద్దూ రేపు విడుదల కానున్నారు.

రేపు జైలు నుంచి విడుదల కానున్న నవజ్యోత్ సింగ్ సిద్దూ
X

34 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటనలో సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన పంజాబ్ కాంగ్రెస్ అగ్రనేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ రేపు పాటియాలా జైలు నుంచి విడుదల కానున్నట్లు ఆయన అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేశారు. అతని లాయర్ హెచ్‌పిఎస్ వర్మ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు.

“సర్దార్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రేపు పాటియాలా జైలు నుండి విడుదలవుతున్నాడని అందరికీ తెలియజేస్తున్నాను.'' అని సిద్దు అధికారికట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

పంజాబ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన 59 ఏళ్ల సిద్దూకు సుప్రీంకోర్టు గత ఏడాది మేలో ఒక సంవత్సరం కఠినమైన జైలు శిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తవ్వడంతో సిద్దూ రేపు విడుదల కానున్నారు. పంజాబ్ జైలు నిబంధనల ప్రకారం సత్ప్రవర్తన కలిగిన దోషి సాధారణ ఉపశమనం పొందేందుకు అర్హులని సిద్దూ లాయర్ వర్మ అన్నారు. దాని వల్ల సిద్దూ కొన్ని రోజుల ముందుగానే జైలు నుండి విడుదలవుతున్నారు.

డిసెంబర్ 27, 1988న, పాటియాలా నివాసి అయిన 65 ఏళ్ల గుర్నామ్ సింగ్‌తో పార్కింగ్ స్థలం విషయంలో సిద్ధూ వాగ్వాదానికి దిగాడు. సిద్ధూ, అతని స్నేహితుడు రూపిందర్ సింగ్ సంధు, గుర్నామ్ సింగ్‌ను అతని కారు నుండి బయటకు లాగి కొట్టారు. అనంతరం గుర్నామ్ సింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్ధూ గుర్నామ్‌సింగ్‌ను తలపై గట్టిగా కొట్టడం వల్లనే గుర్నామ్ సింగ్ చనిపోయాడని ప్రత్యక్ష సాక్షి ఆరోపించారు.

First Published:  31 March 2023 11:01 AM GMT
Next Story