Telugu Global
National

నాగ్‌పూర్‌ హింస: అంతా 'ఛావా' వల్లే

అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

నాగ్‌పూర్‌ హింస: అంతా ఛావా వల్లే
X

నాగ్‌పూర్‌లో గత రాత్రి నుంచి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ఒక రకంగా 'ఛావా' మూవీనే కారణమని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ అన్నారు. మొఘలాయి చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలిగించాలనే డిమాండ్‌తో మొదలైన ఆందోళన కాస్త హింసాత్మకంగా మారింది. దీంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈ పరిస్థితులపై ఆయన ఇవాళ అసెంబ్లీలో కీలక విషయాలు వెల్లడించారు. ఇక్కడ నేను ఒక సినిమాను మాత్రమే తప్పుపట్టాలని అనుకోవడం లేదు. కానీ ఇలా మాట్లాడక తప్పడం లేదు. శంభాజీ మహారాజ్‌ చరిత్రను ఛావా సినిమా ప్రజల ముందు ఉంచింది. అదే సమయంలో పలువురి మనోభవాలు రగిలిపోయాయి. అందుకే ఔరంగజేబుపై వ్యతిరేకత ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. అయితే ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర అనే అనుమానం వ్యక్తం చేశారు. ఔరంగజేబు సమాధిని తొలిగించాలనే డిమాండ్‌తో సోమవారం వీహెచ్‌వీ, బజరంగ్‌దళ్‌ ధర్నా చేపట్టాయి. కర్రలతో ఔరంగజేబ్‌ నకిలీ సమాధిని ఒకదానిని ఏర్పాటు చేసి తగలబెట్టారు. కొద్దిసేపటికే మతపరమైన ప్రతులు తగలబెట్టారని ప్రచారం జరిగింది. ఇది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అందుకే ఇందులో కుట్రకోణం కూడా దాగి ఉండొచ్చు అన్నారు.

First Published:  18 March 2025 5:51 PM IST
Next Story