Telugu Global
National

మత ఓట్ల పోలరైజేషన్ కోసం ఇలాంటి పనులా ?

ఇప్పుడు యోగీ సొంత పట్టణమైన గోరఖ్ పూర్ లో పెద్దఎత్తున వార్డుల పేర్లు మారుస్తున్నారు. ముస్లిం పేర్లతో ఉన్న వార్దుల పేర్లను హిందూ పేర్లుగా మార్చడమే లక్ష్యంగా మునిసిపల్ కార్పొరేషన్ ముసాయిదా డీలిమిటేషన్ ఆర్డర్ జారీ చేసింది.

మత ఓట్ల పోలరైజేషన్ కోసం ఇలాంటి పనులా ?
X

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ హిందూ అతివాదానికి ప్రతీక, ఆ రాష్ట్రంలో ఆయన వేరే పనులేమీ చేయకపోయినా, పట్టణాలు, వీధుల పేర్లు మార్చడం, బుల్డోజర్లతో తమకు నచ్చని వాళ్ళ ఇళ్ళను కూలగొట్టడం మాత్రం దిగ్విజయంగా చేస్తున్నారు. ఆక్సిజన్ అందక పిల్లలు మరణించినా, కరోనా కారణంగా చనిపోయిన వాళ్ళ శవాలు గంగానదిలో కొట్టుకవచ్చినా పెద్దగా పట్టించుకోని యోగీ సర్కార్ ఈ పేర్లు మార్చడం కార్యక్రమాన్ని మాత్రం ఉద్యమంలాగే చేపట్టింది. దీని ద్వారా మత పోలరైజేషన్ జరగడమే అసలు టార్గెట్.

ఇప్పుడు యోగీ సొంత పట్టణమైన గోరఖ్ పూర్ లో పెద్దఎత్తున వార్డుల పేర్లు మారుస్తున్నారు. ముస్లిం పేర్లతో ఉన్న వార్దుల పేర్లను హిందూ పేర్లుగా మార్చడమే లక్ష్యంగా మునిసిపల్ కార్పొరేషన్ ముసాయిదా డీలిమిటేషన్ ఆర్డర్ జారీ చేసింది.

మునిసిపల్ కార్పొరేషన్ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, ఇలాహి బాగ్‌ను ఇప్పుడు బంధు సింగ్ నగర్‌గా, ఇస్మాయిల్‌పూర్‌ని సహబ్ గంజ్ గా, జాఫ్రా బజార్‌ను ఆత్మ రామ్ నగర్‌గా పిలుస్తారని తెలిపారు. ఇక మియా బజార్, ముఫ్తీపూర్, అలీనగర్, తుర్క్‌మన్‌పూర్, ఇస్మాయిల్‌పూర్, రస్సోల్‌పూర్, హుమాయున్‌పూర్ నార్త్, ఘోసిపూర్వ, దౌద్‌పూర్, జాఫ్రా బజార్, ఖాజీపూర్ ఖుర్ద్, చక్సా హుస్సేన్ తదితర పేర్లను మార్చడానికి ఆర్డర్ జారీ చేశారు.

ప్రజలు తమ అభ్యంతరాలను వారం రోజుల్లోగా దాఖలు చేయవచ్చని, వాటిని పరిష్కరించిన తర్వాత డీలిమిటేషన్‌కు ఆమోదం తెలుపుతామని మున్సిపల్ కమిషనర్ అవినాష్ సింగ్ తెలిపారు.

మేయర్ సీతారాం జైస్వాల్ మాట్లాడుతూ పాత పేర్లు మార్చి కొత్త పేర్లు పెట్టడం గర్వంగా ఉందన్నారు.

అయితే ఈ పేర్ల మార్పు వ్యవహారంపై సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి.

సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఇస్మాయిల్‌పూర్ కార్పొరేటర్ షహబ్ అన్సారీ, పేర్లను మార్చడం మత పోలరైజేషన్ కోసం చేసే ప్రయత్నమని ఆరోపించారు.దీనికి సంబంధించి తమ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం జిల్లా కలెక్టర్ తో సమావేశమై అభ్యంతరాన్ని లేవనెత్తుతుందని చెప్పారు.

కాంగ్రెస్ నాయకుడు తలత్ అజీజ్ పేరు మార్చే కసరత్తు డబ్బు వృధాగా అభివర్ణించారు. "ఈ వ్యాయామం ద్వారా ప్రభుత్వం ఏమి సాధించదల్చుకుందో నాకు అర్థమవడంలేదు'' అన్నారాయన‌

First Published:  5 Sept 2022 8:44 AM IST
Next Story