Telugu Global
National

మధ్యప్రదేశ్‌లో దారుణం - జై శ్రీరామ్ అనలేదని బాలుడిపై దాడి

ఖండ్వాకు చెందిన 5వ‌ తరగతి చదివే ముస్లిం బాలుడు ట్యూషన్‌కు వెళుతుండగా ఆ బాలుడిని అజయ్ అలియాస్ రాజు భిల్ అనే యువకుడు అడ్డగించాడు. జైశ్రీరామ్ అని నినాదాలు చేయాలని బాలుడిపై ఒత్తిడి చేశాడు. అయితే ఆ బాలుడు మౌనంగా ఉండిపోవడంతో చెంపకేసి కొట్టాడు.

మధ్యప్రదేశ్‌లో దారుణం  - జై శ్రీరామ్ అనలేదని బాలుడిపై దాడి
X

ఇటీవల కాలంలో దేశంలో మతపరమైన ఘర్షణలు జరగడం అధికమైంది. కొందరు ప్రతి వివాదాన్ని మత కోణంలోనే చూస్తున్నారు. చివరికి రైల్వే స్టేషన్లకు ఎటువంటి రంగులు వాడాలో, హీరోయిన్లు ఏ కలర్ దుస్తులు వేసుకోవాలో కూడా సూచిస్తున్నారు. దేశంలో పరిస్థితులు ఈ విధంగా ఉండగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన మతాల మధ్య మరింత విద్వేషం రగిలేలా చేసింది.

తన దారిన తాను పోతున్న ఓ పదేళ్ల ముస్లిం బాలుడిని ఓ యువకుడు అడ్డగించి జైశ్రీరామ్ అని అనాలని ఒత్తిడి చేశాడు. అతడు అనలేదని దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం సృష్టిస్తోంది. ఖండ్వాకు చెందిన 5వ‌ తరగతి చదివే ముస్లిం బాలుడు ట్యూషన్‌కు వెళుతుండగా ఆ బాలుడిని అజయ్ అలియాస్ రాజు భిల్ అనే యువకుడు అడ్డగించాడు. జైశ్రీరామ్ అని నినాదాలు చేయాలని బాలుడిపై ఒత్తిడి చేశాడు.

అయితే ఆ బాలుడు మౌనంగా ఉండిపోవడంతో చెంపకేసి కొట్టాడు. జరిగిన సంఘటన గురించి బాలుడు ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో వారు పంధానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అజయ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఖండ్వా డీఎస్పీ అనిల్ చౌహాన్ తెలిపారు. నిజా నిజాలు విచారించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన దారిన తాను పోతున్న బాలుడిని అడ్డగించడమే కాకుండా జైశ్రీరామ్ అని నినాదాలు చేయాలని బలవంత పెట్టిన ఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

First Published:  30 Dec 2022 4:25 PM IST
Next Story