అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి పిచ్చి వేషాలు వేస్తే...
ముంబైకి చెందిన ఆజమ్ షేక్ రన్నింగ్ ట్రైన్‌ను పట్టుకుని ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటాడు. స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంటాడు.
మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడో, వెహికల్‌పై వెళ్తున్నప్పుడే కొందరు ఆకతాయిలు రోడ్లపై నానాయాగీ చేస్తుంటారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోటి వాహనదారుల్ని ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి వాళ్లను చూసినపుడు వీడు ఎక్కువరోజులు బతకడు అని అంటుంటాం. వీడికేం కాదు వీడివళ్ల అమాయకులే పోతారు అని అనడం కూడా వింటుంటాం. అలాంటి ఆకతాయి కథే ఇది. మ్యాటర్‌లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఆజమ్ షేక్ రన్నింగ్ ట్రైన్‌ను పట్టుకుని ప్రమాదకర విన్యాసాలు చేస్తుంటాడు. స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెడుతుంటాడు.
గతనెల ఇతడు పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో యువకుడి కోసం గాలిస్తూ పోలీసులు అతన ఇంటికి వెళ్లారు. యువకుడి ఇంటికి వెళ్లిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఆజమ్ షేక్‌కు ఓ చేయి లేదు, ఇంకో కాలు లేదు. నిస్సహాయ స్థితిలో మంచంపై కూర్చొని ఉన్నాడు.
ఏమైందని ఆరా తీయగా ఆజమ్ షేక్ పోలీసులకు అసలు విషయం చెప్పాడు. తన వీడియో వైరల్ అవడంతో మరోసారి అలా ప్రయత్నం చేశానని ఆక్రమంలో తన ఎడమ చేయి, ఎడమ కాలు పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆజమ్ షేక్ లాంటి వాళ్లను మన లైఫ్‌లో కూడా చాలామందినే చూస్తూ ఉంటాం.
ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అల్లరి మూకలు రోడ్లపై తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రయ్యిమని రాంగ్ రూట్‌లో మీదకి వచ్చేస్తారు. ఏమైనా అన్నామంటే వాళ్లే గొడవకు దిగుతారు. అమ్మాయిలను అట్రాక్ట్ చేసేందుకు కొందరు ఇలాంటి వెర్రి వేశాలు వేస్తే.. ఇది మా టాలెంట్ అని ఫీలయిపోయే మూర్ఖులు ఇంకొందరు. ఇలా నలుగుర్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ల లైఫ్‌నే రిస్క్‌లో పెట్టేస్తున్నారు. కన్నవాళ్లకు కడుపు కోత మిగులుస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ ఆజమ్ షేక్ జీవితం ఒక పాఠం.
ట్రైన్‌తో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ కాలు, చేయి పోగొట్టుకున్న యువకుడు
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2024
ముంబై - సెవ్రీ రైల్వే స్టేషన్లో గత నెల ఫర్హాత్ ఆజమ్ షేక్ అనే యువకుడు కదులుతున్న రైలుని పట్టుకొని జారుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు.. ఈ వీడియోలు వైరల్ అవ్వడంతో పోలీసుల దృష్టికి వెళ్లగా కేసు నమోదు… pic.twitter.com/E9jJFJjXm8