గాలిపటం దారమే.. మృత్యుపాశమైంది..
ముంబై నగరంలోని డిండోషి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమీర్ సురేష్ జాదవ్ పోలీస్‌స్టేషన్‌లో తన విధులు ముగించుకొని బైక్‌పై వర్లిలోని తన ఇంటికి బయలుదేరాడు.
సరదాగా ఎగరేసిన గాలిపటం దారమే.. ఓ కానిస్టేబుల్‌కి మృత్యుపాశమైంది. ఊహించని ఈ పరిణామం అతని కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. గాలిపటం దారం వల్ల కానిస్టేబుల్ ప్రాణం పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ముంబై నగరంలోని డిండోషి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సమీర్ సురేష్ జాదవ్ పోలీస్‌స్టేషన్‌లో తన విధులు ముగించుకొని బైక్‌పై వర్లిలోని తన ఇంటికి బయలుదేరాడు. స్థానిక వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై వకోలా వంతెన వద్దకు చేరుకునేసరికి అప్పటికే ఎగురుతున్న గాలిపటం దారం అతని గొంతుకు చుట్టుకొంది. దానిని గమనించేలోపే దారం గొంతుకు చుట్టుకొని దాని రాపిడికి గొంతు వద్ద తీవ్ర గాయమైంది.
స్థానికులు వెంటనే స్పందించి సమీర్ సురేష్ జాదవ్‌ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఖేర్వాడి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మృతుని బంధువులకు సమాచారం అందించారు.