కోన్ ఐస్‌క్రీంలో కోసి పడేసిన మనిషి వేలు.. ఆ కస్టమర్ ఏం చేశాడంటే..
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువ వైద్యుడు ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావోకి ఐస్‌క్రీమ్ తినాలనిపించింది. వెంటనే తన సోదరితో కలిసి ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్ పెట్టాడు.
మండే ఎండల్లో ఎవరికైనా ఐస్‌క్రీం తినాలనిపించడం కామన్ . కానీ, వాటి తయారీపై ఆందోళన అందరికీ ఉంటుంది. ఎందుకంటే లోకల్ మేడ్ ఐస్‌క్రీమ్ అయితే అందులో ఏం వాడతారో , ల్లో పురుగులు కన్పించిన ఘటనలు చూశాం. కానీ, ఇప్పుడు ఏకంగా మానవ అవయవాలు రావడం గమనార్హం.
ముంబయిలోని ఓ డాక్టర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌అవి తయారు చేసే పరిసరాలు ఎలా ఉంటాయో అన్న అనుమానం ఉంటుంది అయితే అదే మంచి కంపెనీ ఐస్ క్రీమ్ అయితే అంతా సవ్యంగా ఉంటుంది అని నమ్ముతాం. కానీ పాపం అలా నమ్మే ఒక మంచి కంపెనీ ఐస్ క్రీమ్ లో ఏకంగా మనిషి వేలు వచ్చింది.
ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువ వైద్యుడు ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావోకి ఐస్‌క్రీమ్ తినాలనిపించింది. వెంటనే తన సోదరితో కలిసి ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్ పెట్టాడు. నిమిషాల్లో ఐస్ క్రీమ్స్ ఇంటికి డెలివరీ అయ్యాయి. చక్కగా తినడం మొదలుపెట్టాక.. నోట్లో ఏదో గట్టిగా తగిలింది. ముందు అది చాక్లెట్ లేదా నట్స్ అనుకున్నాడు కానీ ఎందుకో పరీక్షగా చూడగా అది ఓ మనిషి వేలు లాగా అనిపించింది.
అది కూడా చిన్నది కాదు సరిగ్గా 2 అంగుళాలు. వెంటనే తెరుకొని స్థానిక మలాడ్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అధికారులు కూడా వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొన్నారు. వేలును ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామనీ, ఆ ఐస్‌క్రీం తయారు చేసిన సంస్థ ప్రాంగణంలో కూడా తనిఖీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.